తన సినిమాల్లో హీరోల బెస్ట్ లుక్స్ ప్రజెంట్ చేయడంలో దర్శకధీరుడు రాజమౌళిది అంది వేసిన చెయ్యి. త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ను తమ కెరీర్‌లోనే ఎవరు ఎప్పుడూ చూపించనంత బెస్ట్ లుక్ లో చూపించాడు. ఇక బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ లుక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు వంతు వచ్చింది. మహేష్, రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. దీనికి సంబంధించి మహేష్ పై విదేశాల్లో ఫోటోషూట్ కూడా జరిగింది. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ ఎలా ? ఉండబోతుందనే అంశంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు.
అయితే దీనిపై చిన్న క్లారిటీ వచ్చేసింది. తాజాగా మహేష్ బాబు తన భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి అనంత్ అంబానీ పెళ్లికి హాజరయ్యాడు. ఈ క్రమంలోనే మహేష్ బాలీవుడ్ మీడియాకు ఫోజులు ఇచ్చాడు. అందులో లాంగ్ హెయిర్, గడ్డం, మీసాలతో కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమాలోను కనిపించని మేకవర్ ఇది. బహుశా రాజమౌళి సినిమాలో మహేష్ లుక్ కూడా ఇదే కావచ్చు. సినిమా షూటింగ్‌కు ఇంకా టైం ఉంది కాబట్టి.. ఈ లుక్ లో మరికొన్ని మార్పులు చేర్పులు కూడా ఉంటాయని తెలుస్తుంది.
ఓవరాల్‌గా పరిశీలిస్తే రాజమౌళి సినిమాలో.. మహేష్ బాబు లాంగ్ హెయిర్‌తో కనిపించబోతున్నాడని మాత్రం పక్కాగా రివీల్ అయింది. ఈ లుక్ చూసిన నెటిజన్లు స్టార్ సినిమాలో హీరోలా మహేష్ బాబు ఉన్నాడంటూ పొంగిపోతున్నారు. కేవలం లుక్ పరంగానే కాకుండా.. ఫిట్‌నెస్ పరంగా కూడా మహేష్ బాబు కోసం ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు. సరిలేరు నీకెవ్వరు, గుంటూరు కారం సినిమాల్లో స్టైలీష్‌గా కనిపించిన మహేష్ బాబు.. రాజమౌళి సినిమా కోసం కాస్త కండలు పెంచుతున్నట్టు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా అడవుల్లో అడ్వెంచర్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. 2026 లో ఈ సినిమా రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.