దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకపోతున్న సంగతి తెలిసిందే. అటు నార్త్ తో పాటు ఇటు సాత్ ఇండస్ట్రీలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ అగ్ర తారగా ఎదిగేందుకు కష్టపడుతోంది. అలాగే మరోవైపు శేఖర్ పహారియాతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది. పెళ్లెప్పుడు అనేది చెప్పకపోయినా.. కలిసి ఏడడుగులు వేయడం ఖాయం అనేట్లుగా ఈ జంట సూచనలు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్తున్నారు.
ఇకపోతే గతంలో జాన్వీ కపూర్ మరియు శేఖర్ మధ్య బ్రేకప్ జరిగింది. కానీ ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసిపోయారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శేఖర్ ఫహరియాతో లవ్, బ్రేకప్, ప్యాచప్ పై జాన్వీ కపూర్ ఓపెన్ అయింది. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడల్లా నా బాయ్‌ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యేది. ఆ టైమ్ లో నాకు మూడు స్వింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి ప్రభావం నా బాయ్‌ఫ్రెండ్ పై పడేది.
కోపం, చిరాకు, అసహనం.. ఇలా వివిధ ఎమోషన్స్ కారణంగా ప్రతినెలా అతనికి బ్రేకప్ చెప్పేదాన్ని. రెండు రోజులు గడిచాక వెళ్లి ఏడ్చుకుంటూ సారీ చెప్పేదాన్ని. మొదటి రెండు, మూడు నెలలు బ్రేకప్ అనగానే అతడు షాక్ లో ఉండేవాడు. రాను రాను అతను నా పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఆ టైంలో నేను ఏమన్నా పట్టించుకునేవాడు కాదు.
ఇక లైఫ్ లో ఒకే ఒక్కసారి నా హార్ట్ రియల్ గా బ్రేక్ అయింది. కానీ ఎవరి వల్ల నా హృదయం ముక్కలైందో మళ్లీ అతడే వచ్చి పరిస్థితులు చక్కదిద్ది పగిలిన నా గుండెను ఒకటి చేశాడు. ప్రస్తుతం అంతా హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాడంతో.. నెటిజన్లు ఇంట్రస్టింగ్ గా రియాక్ట్ అవుతున్నారు. పీరియడ్స్ వచ్చినప్పుడల్లా బ్రేకప్పా.. ఇదేం వింత అలవాటు రా నాయనా, ఇలాగైనా జాన్వీతో కష్టమే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.