Moviesఈ బాలయ్య మహా నాటీ రా బాబు.. చిన్న పిల్లాడిలా ఏం...

ఈ బాలయ్య మహా నాటీ రా బాబు.. చిన్న పిల్లాడిలా ఏం చేశాడో చూడండి..!!

చాలామంది అనుకుంటూ ఉంటారు ..బాలయ్య వెరీ వెరీ యాంగ్రీ పర్సన్ ..డెడికేషన్ పర్సన్ ..సరదాగా ఉండడు.. లైఫ్ని ఎంజాయ్ చేయడు..చిల్ అవుట్ టైపే కాదు అని ..కానీ అదంతా తప్పు . బాలయ్యలో కూడా నాటి యాంగిల్ ఉంది . బాలయ్య కూడా సరదాగా లైఫ్ని ఎంజాయ్ చేయగలడు . కానీ కొంతమంది పీపుల్స్ తోనే.. అలా మింగిల్ అవ్వగలడు అంటూ తాజా ఫొటోస్ ద్వారా తెలుస్తుంది . రీసెంట్గా కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి జరిగింది.

వరలక్ష్మి శరత్ కుమార్ తన బాయ్ ఫ్రెండ్ నికోలై సచ్ దేవ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళ పెళ్లి సింపుల్గా జరిగినా.. వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం చెన్నైలో గ్రాండ్ గా ఇచ్చారు . వీరి రిసెప్షన్ కి పలువురు తెలుగు – తమిళం -మలయాళం – కన్నడ – హిందీ పరిశ్రమ నుంచి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు . వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ ఆయన భార్య రాధిక సీనియర్ నటీనటులు కావడంతో ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు .

ఈ క్రమంలోనే ఆ రిసెప్షన్లో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ వేడుకలో చాలామంది సీనియర్ నటీనటులు కలుసుకున్నప్పటికీ ప్రధానంగా కుష్బూ – శోభన – కుష్బూ భర్త సుందర్ – బాలకృష్ణ – వెంకటేష్ దిగిన సెల్ఫీ ఫొటోస్ మాత్రం బాగా ట్రెండ్ అవుతున్నాయి. సరదాగా దిగిన ఈ సెల్ఫీలో కుష్బు – శోభనా చాలా అందంగా కనిపిస్తే .. బాలయ్య నాటి నాటి ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఫొటోస్ కే హైలెట్గా నిలిచారు. బాలయ్య అల్లరి చూసిన జనాలు బాలయ్యలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ సంబరపడిపోతున్నారు. ప్రజెంట్ ఈ ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news