Moviesఇండియన్ సినిమా చరిత్రను తిరగాసిన ప్రభాస్.."కల్కి" క్రియేట్ చేసిన అరుదైన రేర్...

ఇండియన్ సినిమా చరిత్రను తిరగాసిన ప్రభాస్..”కల్కి” క్రియేట్ చేసిన అరుదైన రేర్ రికార్డ్స్ ఇవే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “కల్కి”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అన్న విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . నాగ్ అశ్వీన్ సరికొత్త ప్రపంచంలోకి జనాలను తీసుకువెళ్లాడు . సినిమాలోని సీన్స్ విజువల్ ఎఫెక్ట్స్ హైలెట్గా మారాయి .

మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా చాలా స్టైలిష్ గా రియలిస్టిక్ గా డిజైన్ చేశాడు నాగ్ అశ్వీన్. ఇప్పటి వరకు ఇలాంటి ఒక్క సినిమాను ఎవ్వరు తెరకెక్కించలేదు అనే చెప్పాలి. కల్కి సినిమా కలెక్షన్స్ పరంగా సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే ఎన్నెన్నో క్రేజీ రికార్డ్స్ నెలకొల్పింది. ఈ సినిమా ఇప్పటివరకు ఎలాంటి క్రేజీ రికార్డ్స్ ని స్థాపించిందో క్రియేట్ చేసిందో ఇప్పుడు చదివి తెలుసుకుందాం..!!

  • రిలీజ్ అయిన 5రోజుల్లోనే కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సెన్సేషనల్ రికార్డ్ నెలకొల్పింది.

*నైజాంలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టి.. RRR సినిమా రికార్డ్ ని తుక్కు తుక్కు చేసింది. RRR 23 కోట్లతో ఉండగా కల్కి 24 కోట్లు సాధించి ఫస్ట్ ప్లేస్ అందుకుంది.

  • ఇప్పటి వరకు ఒక వీకెండ్ లో ఇండియా మొత్తం మీద అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా షారుఖ్ ఖాన్ జవాన్ ఉన్నింది. మొత్తం 520 కోట్ల రికార్డుని బ్రేక్ చేసి 555 కోట్లతో కల్కి టాప్ లో నిలిచింది.
  • ఈ సంవత్సరం తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు హనుమాన్ అత్యధికంగా 350 కోట్లతో నిలవగా దాన్ని కల్కి మూడు రోజుల్లోనే బ్రేక్ చేసింది.
  • కెనడాలో కూడా అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా కల్కి నిలిచింది.
  • అమెరికాలో ఫాస్ట్ గా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమాగా కల్కి సంచలన రికార్డ్ నెలకొల్పింది.

*ఇక బుక్ మై షోలో వరుసగా ప్రతి రోజు ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోయిన ఇండియన్ సినిమాగా కల్కి నిలిచింది.

  • అమెరికాలో 12 మిలియన్ డాలర్స్ తో బాహుబలి 2, RRR రికార్డ్ తప్ప అన్ని సినిమాల రికార్డులని దాటేసింది.

*జర్మనీలో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా కల్కి నిలిచింది.

  • ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాల్లో 191 కోట్లతో కల్కి మూడో ప్లేస్ లో నిలిచింది.

కల్కి సినిమా ఎన్ని కలెక్షన్స్ రాబడతాయో, ఎన్ని రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news