Movies"బయటపడ్డ హీరోయిన్ సమంత నిజస్వరూపం"..షాక్ అవుతున్న ఫ్యాన్స్..పరువు పోయిందిగా..!

“బయటపడ్డ హీరోయిన్ సమంత నిజస్వరూపం”..షాక్ అవుతున్న ఫ్యాన్స్..పరువు పోయిందిగా..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సమంత పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉంటాం. మరి ముఖ్యంగా ఆమె మయోసైటీస్ వ్యాధికి గురైనప్పటి నుంచి ఆమె స్పెషల్ ఫోకస్ చేశారు జనాలు . కాగా ఇటీవల కాలంలోనే సమంత మయోసైటిస్ గురించి ఆమె ఎదుర్కొన్న సిచువేషన్ అదేవిధంగా ప్రాబ్లమ్స్ హెల్త్ పాడ్ కాస్ట్ పేరిట వీడియోస్ రూపంలో రిలీజ్ చేస్తుంది. తన ఫ్యాన్స్ ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తూ వస్తుంది . టిప్స్ సలహాలు నెట్టింట పంచుకుంటూ ఉంటుంది . ఈ నేపథ్యంలోనే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మందులు వేసుకోవడం కంటే నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పీల్చుకోవడం వల్ల చాలా రిలీఫ్ ఇస్తుంది అంటూ సమంత సజెస్ట్ చేసింది .

తనకు సలహా ఇచ్చిన ఒక వైద్యుడుని కూడా ట్యాగ్ చేసింది. ఇక్కడే పెద్ద బొక్క పడింది. సమంత చేసిన ఈ పోస్ట్ పై డాక్టర్ సిరియాక్ అభి తప్పు పట్టారు . సమంతను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఏకిపారేశారు .
సమంతకు వైద్య పరంగా ఏమీ తెలియదు అని ఆమెను జైల్లో పెట్టాలి అంటూ కామెంట్ చేశారు . దీనిపై సమంత కూడా రియాక్ట్ అవ్వడం గమనార్హం . సమంత పోస్ట్ చేస్తూ..” గత రెండేళ్లుగా నేను నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను ..ఔషధాలు తీసుకోవాల్సి వచ్చిందన్న విషయం కూడా మీకు తెలుసు. నేను ఏది తీసుకున్న సరే డాక్టర్స్ ని సంప్రదించే తీసుకుంటాను.. నేను ముందు ట్రై చేసి సక్సెస్ అయ్యాక.. ఆ విషయం మీకు చెప్తాను “

“పేరు ఉన్న నిపుణుల పరిశోధన చేసిన తర్వాతే .. ఆ విషయాన్ని మీకు సూచిస్తాను ..డాక్టర్స్ ఇచ్చే ట్రీట్మెంట్ చాలా చాలా ఖరీదైనది ..ఆర్థిక స్తోమత ఉంది ..కాబట్టి నేను భరించగలను కానీ భరించలేని వాళ్ళు పరిస్థితి ఏంటి? అలాంటి వాళ్ల కోసమే ఈ టిప్స్ చెప్తున్నాను ..అంత పిచ్చి మొఖం కాదు నేనేమి అమాయకురాలని అంతకన్నా కాదు .. నేను చికిత్స తీసుకుంటున్న డాక్టర్కు 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది ” అంటూ పరోక్షకంగా తనపై బ్యాడ్ కామెంట్ పెట్టిన డాక్టర్ను ఓ రేంజ్ లో ఏ కేసింది . అంతేకాదు ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో ఆయన డైరెక్ట్ గా ముఖాముఖి పాల్గొని ఉంటే బాగుండేది అంటూ చురకలు కూడా అంటించింది . దీంతో ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news