బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌బీ అమితాబచ్చన్ 80 ఏళ్ల వయసులో కూడా నటుడుగా తన నటనతో భారతీయ సినీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నారు. తాజాగా వచ్చిన టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాలో అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ ఎలా అదరగొట్టారో ? చూశాం. అసలు ఈ వయసులో అమితాబ్ చెప్పిన డైలాగులు.. అమితాబ్ యాక్షన్ సన్నివేశాలు చూసి ప్రతి ఒక్క భారతీయ సినిమా ప్రేమికుడు కళ్ళు చెమ్మగిల్లాయి. అయితే కెరీర్ ప్రారంభంలో అమితాబ్ ఎన్నో అవమానాలకు గురయ్యారు.
డాన్ లాంటి సినిమా ఎన్నిసార్లు.. ఎంత పెద్ద స్టార్ హీరో తో రీమేక్ చేసినా సరే నటనలో అమితాబ్‌ని కొట్టలేరని ప్రూవ్ అయింది. సర్కార్ చేసినా.. బుడ్డా హోగా తేరా బాప్ సినిమా చేసిన అమితాబ్ నటన విశ్వరూపం రేంజ్ లో ఉంటుంది. ఒకదశలో పూరి జగన్నాద్ కథ విన్న అమితాబ్… రామూజీ ఈ సీన్ లో అలా కాకుండా ఇలా ఉంటే బావుంటుందేమో..? అని ఆర్జీవీ దగ్గర ఆయనకున్న డౌట్లు కూడా వ్యక్తం చేశారట.
వెంటనే ఆర్జీవీ ఈ సినిమా హిట్ అయితే అమితాబ్ ఇంతకన్నా పైకి వెళ్లడానికి ఏం ఉంటుంది ? ఈ సినిమా దొబ్బింది అనుకుందాం.. అమితాబ్ ఇంతకన్నా కిందకు వెళతాడా ? వాడేదో మీ ఫ్యాన్.. మీతో సినిమా చేయాలనుకుంటున్నాడు.. అందుకే వాడిని నేను తీసుకువచ్చా అని పూరి జగన్నాథ్‌ను ఉద్దేశించి వర్మ చెప్పాడట. ఆ తర్వాత బుడ్డా టైటిల్ తో వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది. వయస్సులో బిగ్ బి తనకంటే వయస్సులో చాలా చిన్నదైన అమ్మాయి.. అది కూడా అంధురాలు చివర్లో ముద్దు అడిగినప్పుడు అమితాబ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ వేరేలెవల్. అదే బ్లాక్ సినిమా.
2005లో వచ్చిన ఈ సినిమాకి సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడు. రాణీ ముఖర్జీ ఇందులో అమితాబ్ పాటు నటిచింది. ఈ సినిమాలో ముద్దు ఎలా ఉంటుందో క్లైమాక్స్‌లో అమితాబ్‌ని అడిగి మరీ పెట్టుకుంటుంది. ఈ సీన్ షూట్ చేసిన రోజు తాను రెండుసార్లు బ్రెష్ చేసుకున్నానని.. తనకు ఎంతో భయం వేసిందని రాణీ ముఖర్జీ ఓ సందర్భంలో చెప్పింది.