లోకనాయకుడు కమలహాసన్ అంటే హీరోయిన్లతో రొమాన్స్ చేసే విషయంలో పెట్టింది పేరు. కమల్‌హాసన్ కెరీర్ ప్రారంభం నుంచి మంచి ఆటగాడు.. అమ్మాయిలు, హీరోయిన్ల విషయంలో బాగా ఎంజాయ్ చేసేవాడు.. చివరకు వెండి తెర మీద వాళ్లతో రోమాన్స్ చేసే విషయంలోనూ ఎక్కడా వెనక్కు తగ్గేవాడు కాదన్న పేరు ఉంది. మరి ముఖ్యంగా కమలహాసన్ అంటే ముద్దుల విషయంలో బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ కంటే టాప్ అని అందరూ చెప్పుకుంటారు.
ఇక టాలీవుడ్‌లో హీరోలు కూడా హీరోయిన్ ని పెదవి ముద్దు పెట్టుకోవాలని కోరిక కలగడానికి దర్శక.. రచయితలు అందుకు తగినట్లుగా సీను రాయటానికి స్ఫూర్తి కమలహాసన్ సినిమాలే అట. 1980వ దశకంలో తమిళంలో కమలహాసన్ అప్పటి తరం స్టార్ హీరోయిన్లతో చేసే రొమాన్స్ చూసి అప్పటి సౌత్ హీరోలు బాగా కుళ్ళుకునేవారట.. మాకు ఈ ఛాన్స్ ఎప్పుడు వస్తుందా ? అని ఒక్కటే చర్చించుకునేవారట. మరో ట్విస్ట్ ఏంటంటే ఒక్కోసారి కమలహాసన్ ఏ హీరోయిన్ అయినా ముద్దు పెట్టుకోవాలని అనుకుంటే ఆ సీన్ సినిమాలో లేకపోయినా అప్పటికప్పుడు దర్శకులు.. రచయితలపై ఒత్తిడి చేసి ఆ సీన్ పెట్టించేవారట.
ఇక కమలహాసన్ నటించిన భారతీయుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో మనీషా కొయిరాలతో ఓ సాంగ్‌లో ముద్దు పెట్టుకుని షాట్ ఉంటుంది. దర్శకుడు శంకర్ ఈ విషయాన్ని మనీషాకి చెప్పటానికి సందేహించారట. అయితే కమలహాసన్ లీడ్ తీసుకుని మనీషాతో కాసేపు మాట్లాడి టెలిఫోన్ ధ్వనిలా అనే పాటలో ముద్దు పెట్టాడు. ఏది ఏమైనా కమల్ కి హీరోయిన్ ని ముద్దు పెట్టుకోవడం అంటే చాలా సరదా అట.