పైన ఫోటోలో ఉన్నది ఒకప్పటి క్రేజీ హీరోయిన్.. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా టాలీవుడ్ లో చాలా ఫేమస్ అయ్యింది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. కానీ పెళ్లి అయిన కొంతకాలానికి భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఇంతకీ ఆమె మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, ప్రముఖ నటి రేణు దేశాయ్. మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో జన్మించిన రేణు దేశాయ్.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది.
2000లో పార్థిబన్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం జేమ్స్ పాండు చిత్రం ద్వారా రేణు దేశాయ్ నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే సంవత్సరం బద్రి మూవీతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన రేణు నటించింది. ఈ మూవీ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వెంటనే జానీ మూవీలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత రేణు దేశాయ్ తో పవన్ కళ్యాణ్ సహజీవనం ప్రారంభించారు.
అకీరా నందన్ పుట్టిన తర్వాత 2009లో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ పెళ్లి చేసుకున్నారు. 2010లో వీరికి కూతురు జన్మించింది. 2012లో రేణు దేశాయ్ కు పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి పిల్లలను చూసుకుంటూ ఒంటిరి జీవితాన్ని గడుపుతున్న రేణు దేశాయ్.. టైగర్ నాగేశ్వరరావు మూవీతో గత ఏడాది నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
ఇకపోతే హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు రేణు దేశాయ్ పలు యాడ్స్ లో యాక్ట్ చేసింది. అందులో పియర్స్ సోప్ యాడ్ కూడా ఒకటి. అయితే అప్పటి పియర్స్ యాడ్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో రూపంలో రేణు దేశాయ్ తాజాగా పంచుకుంది. వాటిని చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రేణు దేశాయ్ యాడ్స్ లో కూడా నటించిందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.