ఇటీవల సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. కథ డిమాండ్ చేస్తే స్టార్ హీరోలు సైతం లిప్ లాక్ సీన్స్ చేయడానికి మొగ్గు చెప్పుతున్నారు. ఈ జాబితాలో ఇటీవల న్యాచురల్ స్టార్ నాని కూడా చేరాడు. గత కొన్నాళ్ల నుంచి నాని చేసే చాలా చిత్రాల్లో కిస్సింగ్ సీన్ ఉంటోంది. ముఖ్యంగా ఈ విషయంలో బాగా హైలెట్ అయిన చిత్రం శ్యామ్ సింగరాయ్.
కలకత్తా బ్యాక్‌డ్రాప్ లో పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్లుగా చేశారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మితమైన శ్యామ్ సింగరాయ్ చిత్రం 2021లో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీ ఫస్టాఫ్‌లో నాని, కృతి శెట్టి మధ్య వచ్చే హాట్ లిప్ లాక్ సీన్ అప్పట్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తెలుగులో రెండో సినిమాకే కృతి శెట్టి రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోవడం చూసి సినీ ప్రియులు ఆశ్చర్యపోయారు. అలాగే నాని కూడా అంతకు ముందెప్పుడూ అంతటి బోల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చింది లేదు. అయితే ఆ సీన్ చేసేటప్పుడు నానికి మరో జన్మ గుర్తుకు వస్తుంది. కథలో భాగంగానే డైరెక్టర్ రొమాంటిక్ కిస్సింగ్ సీన్ పెట్టాడు. దాంతో నాని ఈ సీన్ చేయక తప్పలేదు.
మరోవైపు కుర్ర హీరోయిన్ కృతి శెట్టి మాత్రం ఓ షాకింగ్ కండీషన్ పెట్టిందట. లిప్ లాక్ సీన్ ను షూట్ చేసేటప్పుడు డైరెక్టర్, కెమెరా మెన్ తప్ప తన చుట్టూ ఇంకెవరూ ఉండకూడదని చెప్పిందట. అలాగైతేనే చేస్తానని కృతి శెట్టి చెప్పిందట. మొదట ఆమె పెట్టిన కండీసన్ కు డైరెక్టర్ రాహుల్ సంకోచించినా.. ఆ తర్వాత కృతి ప్రైవసీని అర్థం చేసుకుని ఆమె చెప్పినట్లే చేశాడట.