చాలామంది హీరోయిన్లు అందంగా కనిపించడం కోసం ఏవేవో సర్జరీలు చేయించుకుని మొహానికి రంగులు పులుముకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ఎలాంటి మేకప్ లు వేసుకోకుండానే కనిపిస్తారు.అయితే సినిమా ఇండస్ట్రీ అన్నాక మొహానికి రంగులు వేసుకోకుండా ఉండలేరు. ఒకవేళ మేకప్ వేసుకోకపోయినా కూడా సినిమా షూటింగ్లో భాగంగా కచ్చితంగా డైరెక్టర్ చెబితే వేసుకోవాల్సిందే. కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చాక తమ బాడీలోని ఏవైనా పార్ట్స్ అంత అందంగా లేకపోతే వేరే వాళ్ళ సలహాల మేరకు ఆ పార్ట్స్ కి సర్జరీలు చేయించుకొని అందంగా తయారు చేసుకుంటారు.
అలా ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ సర్జరీలు చేయించుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు.అయితే ఈ విషయం పక్కన పెడితే ఓ హీరోయిన్ తన బాడీ లోని ఆ ప్రైవేట్ పార్ట్ అందంగా కనిపించడం కోసం ఏకంగా నాలుగు సబ్బులు అరిగేలా పెట్టుకుందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనేది చూస్తే ఆమె ఎవరో కాదు ఒకప్పటి నటి అంకిత.. సింహాద్రి సినిమాతో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న అంకిత టాలీవుడ్ లో రస్నా బ్యూటీగా ఫేమస్ అయ్యింది. ఈ ముద్దుగుమ్మ బాలకృష్ణతో విజయేంద్ర వర్మ, హరికృష్ణ నటించిన లాహిరి లాహిరి లాహిరిలో మూవీలో కూడా నటించింది.
అలాగే వినాయకుడు, నవ వసంతం, సీతారాముడు, అనసూయ వంటి సినిమాల్లో కూడా నటించింది. ఇక ఈమె నటించిన సినిమాలు అంతగా హిట్ కాకపోవడంతో ఇండస్ట్రీలో ఎక్కువ సంవత్సరాలు నిలదొక్కుకోలేకపోయింది. ఇక ఈమెకు పేరు తెచ్చిన సినిమా అంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం సింహాద్రి సినిమానే అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి అంకిత సింహాద్రి సినిమాలో చాలా గ్లామర్ గా కనిపిస్తుంది. అలాగే ఈ మూవీలో “చీమ చీమ” అనే సాంగ్ ఉంటుంది. అయితే ఈ పాట రావడానికి ముందు తన బాడీ లోపలికి వెళ్లిన చీమ బయటకు రావడం కోసం జూనియర్ ఎన్టీఆర్ బొడ్డు చుట్టూ తేనె రాస్తూ ఉంటాడు.
అయితే ఈ సన్నివేశంలో తన బొడ్డు పార్ట్ చాలా అందంగా కనిపించడం కోసం ఈ సన్నివేశానికి ముందు దాదాపు నాలుగు సబ్బులు అరిగేలా పెట్టుకుందట.. ఇక ఎన్టీఆర్ అంకిత బొడ్డుకి తేనె రాసే సన్నివేశంలో ఆమె బొడ్డు షైనింగ్ గా కనిపిస్తుందో చెప్పనక్కర్లేదు. ఇక ఈ విడుదలైన సమయంలో అంకితకి సంబంధించిన ఈ న్యూస్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది.