టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రభాస్.. ఈ ఏడాది కల్కి సినిమాతో మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. కల్కి వసూళ్లు ఇప్పటికే రు. 1000 కోట్లు దాటేశాయి. నార్త్ అమెరికాలోనే ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్ చేసి ఇప్పటికే ఏకంగా 18 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది.
ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో మామూలు సినిమాలు లేవు. ప్రభాస్ ఒక ఇంటర్నేషనల్ స్టార్ హీరో అయిపోయాడు. ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ అంటే ఎవరు ? మాత్రం వదులుకుంటారు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా ప్రభాస్‌తో ఒక్క సినిమాలో అయినా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఉంటుంది. బాలీవుడ్‌లో పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం ప్రభాస్‌తో ఒక్క సినిమా చేస్తే చాలు.. తమ జన్మ ధన్యం అయిపోతుందని భావిస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసిన ఒక హీరోయిన్ కు మాత్రం ప్రభాస్ పక్కన నటించే అవకాశం వచ్చి చేజారిపోయింది.
ఆ దురదృష్టవంతురాలు ఎవరో కాదు.. రకుల్ ప్రీత్ సింగ్. ప్రభాస్ మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో ముందుగా రకుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. ప్రభాస్, రకుల్ ప్రీత్ కాంబినేషన్లో కొన్ని సీన్లు కూడా షూట్ చేశారు. అయితే వారిద్దరి కాంబినేషన్ ఎక్కడో సెట్ కావటం లేదు. వెంటనే నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని క్యాచ్ చేశారు. హీరో, హీరోయిన్ల జంట సరిగా మ్యాచ్ కావడం లేదని నిర్ణయించుకుని.. రకుల్ ప్రీత్ సింగ్‌ను తప్పించి.. ఆ ప్లేస్ లో కాజల్‌ను తీసుకున్నారు. అప్పటికే కాజల్.. దిల్ రాజు బ్యానర్ లో ఎన్టీఆర్ పక్కన బృందావనం సినిమాలో నటిస్తోంది. అలా ఆమెతో మాట్లాడి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలోను కాజల్‌నే ఫిక్స్ చేశారు. పాపం ప్రభాస్ పక్కన ఓ బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించే ఛాన్స్ రకుల్ కోల్పోయింది.