Moviesనితిన్ `శ్రీఆంజ‌నేయం`లో ఛార్మీ క‌న్నా ముందు ఎంపికైన హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

నితిన్ `శ్రీఆంజ‌నేయం`లో ఛార్మీ క‌న్నా ముందు ఎంపికైన హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

ఖడ్గం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ నుంచి వ‌చ్చిన చిత్ర‌మే శ్రీ అంజ‌నేయం. నితిన్, ఛార్మీ కౌర్ ఈ సినిమాలో జంట‌గా న‌టించారు. అర్జున్ సర్జా, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, జోగి నాయుడు త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించ‌గా.. మెలోడి బ్ర‌హ్మా మణిశర్మ సంగీతం అందించాడు.

శ్రీఆంజ‌నేయం మూవీకి కృష్ణ‌వంశీ డైరెక్ట‌ర్ గానే కాకుండా నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. భారీ అంచ‌నాల న‌డుమ 2004 జులై 24న విడుద‌లైన ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది. యావ‌రేజ్‌గా ఆడి క‌మ‌ర్షియ‌ల్ గా ఫ్లాప్ అయింది. కానీ టెలివిజ‌న్ లో మాత్రం శ్రీఆంజ‌నేయం మూవీకి ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్ రెస్పాన్స్ ద‌క్కింది.

ఇక‌పోతే శ్రీఆంజ‌నేయంలో హీరోయిన్ ఛార్మీ న‌ట‌న‌తో పాటు త‌న‌ అంద‌చందాల‌తో ఓ రేంజ్ లో అల‌రించింది. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ఆమె ఈ చిత్రానికి ఫ‌స్ట్ ఛాయిస్ కాదు. డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ మొద‌ట ఆర్తి ఆగ‌ర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ ను ఎంపిక చేశారు.

గంగోత్రి మూవీతో అతిది అప్పుడే ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె లుక్స్ మ‌రియు ప‌ర్ఫామెన్స్ న‌చ్చ‌డంలో కృష్ణ‌వంశీ శ్రీఆంజ‌నేయం సినిమాలో హీరోయిన్ గా అతిదిని తీసుకున్నారు. షూటింగ్ కూడా ప్రారంభ‌మైంది. అయితే కొన్ని సీన్స్ లో ఎక్స్పోజింగ్ చేయాల‌ని కృష్ణ‌వంశీ చెప్పార‌ట‌. కానీ అందుకు అదితి ఒప్పుకోలేదు. ఈ క్ర‌మంలోనే కృష్ణ‌వంశీ, అదితి మ‌ధ్య మాట మాట పెరిగి షూటింగ్ ఆగిపోయింది. కృష్ణ‌వంశీ అదితిని హీరోయిన్ గా త‌ప్పించి ఛార్మీని తీసుకున్నారు. ఇక శ్రీఆంజ‌నేయం ప‌రాజ‌యం పాలైనా.. ఛార్మీకి మాత్రం ఆ త‌ర్వాత మ‌రిన్ని అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. అదితి మాత్రం కొంత కాలానికే ఫేడౌట్ అయిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news