రాజాధిరాజు.. సినిమా.. నేటి తరం వారికి పెద్దగా గుర్తుండకపోవచ్చు. ఈ సినిమాను ప్రస్తుత వైసీపీ నాయ కుడు, సినిమాటోగ్రఫీ చైర్మన్ విజయచందర్ నిర్మించారు. దీనికి ఆయనే దర్శకత్వం వహించారు. నిజాని కి ఈ సినిమా అనుకోకుండా చేసింది కాదు. అతి విశ్వాసంతో చేసిందని అంటారు. ఎందుకంటే.. దీనికి ముందు విజయ్‌చందర్ తీసిన కరుణామయుడు సూపర్ హిట్ అయింది.
నిజానికి ఆ సినిమా తీసేసమయంలో విజయ్‌చందర్‌కు డబ్బులు లేవు. అయినా.. మిత్రుల ప్రోత్సాహంతో పౌరాణిక స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించారు. కరుణామయుడిలో శ్రీశ్రీ అందించిన సాయం మరిచిపో లేనని చెప్పారు. ఈ సినిమా హిట్ అవుతుందని అనుకోలేదు కానీ… భారీగా విజయం సాధించి.. అనూ హ్యంగా డబ్బులు వచ్చాయి. ఈ డబ్బులతో తాను చేసిన అప్పులు కూడా తీర్చేశారు. అయితే.. కొంత సొమ్ము మిగిలి ఉంది.
దానికి మరో 5 లక్షలు వడ్డీకి అప్పు చేసి రాజాధిరాజు అనే సినిమాను తీశారు విజయ్‌చందర్. దీనిపై అతి విశ్వాసం పెట్టుకున్నారని సినిమా వర్గాలు అప్పట్లోనే పేర్కొన్నారు. పాటలు కూడా బాగానే ఉన్నప్పటికీ.. కథలో బలం లేదనే టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఫలితంగా చేసి అప్పులు కూడా తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి ముందు ఒక చిత్రం చోటు చేసుకుంది.
సినిమా విడుదల ఫంక్షన్‌ను గ్రాండ్‌గా చేశారు విజయ్‌చందర్. దాదాపు సినిమాలో నటించిన వారికి అందరికీ వెండి వస్తువులు(పళ్లాలు) కానుకలుగా ఇచ్చారు. ఇదొక ఖర్చు. మొత్తానికి సినిమా హిట్ అవుతుందని అనుకున్నా.. ఫట్ అయింది. దీంతో విజయచందర్‌కు మొహం చెల్లలేదు. ఒకవైపు అప్పులు.. మరోవైపు పరాభవం. దీంతో ఆయన వారం రోజుల పాటు చెన్నైలోని ఓ బార్ నుంచి బయటకు రాలేదట. ఈ విషయం ఓ సందర్భంలో ఆయనే చెప్పుకొన్నారు.