సీనియర్ నటి స్నేహ ఇప్పటికి కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉందో అలాంటి అందాన్నే మెయింటైన్ చేస్తూ వస్తుంది.ఇక ఈమె నటుడు ప్రసన్నని పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక సినిమా ఇండస్ట్రీకి కొన్ని రోజులు దూరమైంది. ఆ తర్వాత మళ్లీ సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ వంటి సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక సినిమాల్లోకి వచ్చిన కొత్తలో స్నేహ సాంప్రదాయమైన పాత్రలు చేస్తూ సౌందర్య అంతటి గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా ఎక్స్పోజింగ్ చేసే పాత్రల్లో నటించకుండా సాంప్రదాయమైన పాత్రలతోనే ప్రేక్షకుల్లో ఆదరణ పొందింది.
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ మీద అప్పట్లో ఎన్నో రూమర్స్ వినిపించాయి.ముఖ్యంగా సౌందర్య చనిపోతే ఈమె పార్టీ చేసుకుందనే టాక్ కూడా వినిపించింది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని ఆమె కొట్టి పారేసింది. స్నేహ సినీ కెరియర్ కాసేపు పక్కన పెడితే.. అప్పట్లో స్నేహని ఓ డైరెక్టర్ కొట్టిన వార్త తమిళ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఆ హీరోని ప్రేమిస్తుంది అనే కోపంతో ఆ డైరెక్టర్ స్నేహ పై చేయి చేసుకున్నాడు అనే టాక్ వినిపించింది. మరి ఇంతకీ స్నేహ ఏ డైరెక్టర్ చేతిలో గాయాలపాలైందో ఇప్పుడు చూద్దాం.. సీనియర్ నటి స్నేహకి గతంలో హీరోయిన్ గా మంచి క్రేజ్ వచ్చిన సమయంలో యాక్సిడెంట్ జరిగిందనే టాక్ వినిపించింది.
అయితే అది యాక్సిడెంట్ కాదు ఓ డైరెక్టర్ స్నేహ పై దాడి చేశారు అంటూ తమిళంలో ఓ న్యూస్ ప్రచారం అయింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు అప్పటి స్టార్ డైరెక్టర్ అయిన సుశీ గణేషన్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సుశీ గణేషన్ తోనే స్నేహ సినిమాలు చేసింది. ఇక ఇండస్ట్రీకి వచ్చాక కొద్ది రోజులకి స్నేహ హీరోయిన్ గా కాస్తా నేమ్ ఫేమ్ తెచ్చుకోవడం తో సుశీ గణేషన్ ని పట్టించుకోలేదట. అంతేకాకుండా నటుడు ప్రశాంత్ తో ఓ సినిమాలో కలిసి చేసే సమయంలో ప్రశాంత్ తో స్నేహ కలిసి ఉండడం సుశీ గణేషన్ కి అస్సలు నచ్చలేదట.
ఎందుకంటే అప్పటికే సుశీ గణేషన్ స్నేహ పై పీకల్లోతూ ప్రేమ పెంచుకున్నారట. దాంతో వేరే హీరోతో స్నేహ క్లోజ్ గా ఉండడం సహించలేని డైరెక్టర్ సుశీ గణేషన్ ఓ రోజు స్నేహ పై దాడి చేశారట. ఆ దాడిలో స్నేహ కి కాస్త గాయాలు కూడా అయ్యాయట. అయితే ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తీసుకు వెళ్లారట.అయితే స్నేహ హాస్పిటల్ కి వెళ్లడంతో ఈ విషయం కొద్ది క్షణాల్లోనే కోలీవుడ్ మీడియా మొత్తం ప్రచారం అయ్యింది.