సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ అనగానే గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి. మలయాళ చిత్రం ప్రేమమ్ తో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన సాయి పల్లవి.. ఫిదా తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అటు తమిళంలో మారి 2 ద్వారా సూపర్ పాపులర్ అయింది. తన యాక్టింగ్, డ్యాన్సింగ్ స్కిల్స్ తో పాటు పాత్రల ఎంపిక ద్వారా సాయి పల్లవి ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం సౌత్ సినిమాలతో పాటు నార్త్ లో కూడా మూవీస్ చేస్తూ కెరీర్ ను పరుగులు పెట్టిస్తుంది. అయితే టాలీవుడ్ లో సాయి పల్లవి చాలా చిత్రాల్లో నటించింది. టాప్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి టాలీవుడ్ టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. సరిగ్గా గమనిస్తే తెలుగులో ఆమె చేసిన సినిమాలన్నీ టైర్ 2 హీరోలతోనే.
టాప్ స్టార్లకు జోడిగా నటించే అవకాశం సాయి పల్లకి రాకపోవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. సాయి పల్లవి తాను చేసే ప్రతి సినిమాలోనూ తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటుంది. అలాగే రొమాంటిక్ సన్నివేశాలకు, స్కిన్ షోకు సాయి పల్లవి చాలా దూరం. ఇకపోతే యాక్టింగ్ పరంగా, డాన్స్ పరంగా సాయి పల్లవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
హీరోలను సైతం డామినేట్ చేస్తుందనే టాక్ ఇండస్ట్రీలో బలంగా ఉంది. అయితే అదే ఆమెకు పెద్ద మైనస్ అయ్యిందని చెప్పొచ్చు. టాలీవుడ్ టాప్ స్టార్స్ తమ పక్కన ఛాన్స్ ఇవ్వకపోవడానికి సాయి పల్లవి పాటించే కొన్ని నిబంధనలు ఒక విధంగా కారణమైతే.. యాక్టింగ్ లో డాన్స్ లో కో-స్టార్స్ ను డామినేట్ చేస్తుందనే టాక్ మరొక కారణమని అంటున్నారు. అందుకే ఇంతవరకు టాలీవుడ్ లో ఒక్క స్టార్ హీరోతో కూడా సాయి పల్లవి జత కట్టలేకపోయిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.