ఇస్మార్ట్ శంకర్ మూవీతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ నభా నటేష్.. ఆ వెంటనే హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో వంటి చిత్రాలతో బిజీ హీరోయిన్ గా గడిపింది. కానీ, 2021 తర్వాత సడెన్ గా వెండితెరపై మాయమైంది. వరుస పరాజయాల వల్ల అవకాశాలు రావట్లేదేమో అని అంతా అనుకున్నారు. కానీ అసలు కారణం అది కాదు. కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు నభా నటేష్ కు యాక్సిడెంట్ జరిగింది. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది.
యాక్సిడెంట్ నుంచి కోలుకున్న అనంతరం నభా నటేష్ మళ్లీ కెరీర్ పై దృష్టి పెట్టింది. వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టింది. త్వరలోనే డార్లింగ్ మూవీతో వెండితెరపై రీఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటించారు. జూలై 19 నుండి డార్లింగ్ మూవీ థియేటర్స్ లో సందడి చేయబోతోంది.
అయితే తాజాగా డార్లింగ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నభా నటేష్.. వృత్తిపరమైన విషయాలే కాకుండా పలు పర్సనల్ సీక్రెట్ ను కూడా రివీల్ చేసింది. ఈ క్రమంలోనే తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి కూడా నభా మాట్లాడింది. యాక్సిడెంట్ వల్ల నా షోల్డర్‌కి తీవ్ర గాయమైయింది. రెండు చోట్ల ఎముక విరగడంతో సర్జరీలు జరిగాయి. మళ్లీ ఫుల్ ఫిట్‌గా మారి మునుపటి ఎనర్జీ వచ్చిన తర్వాతే స్క్రీన్ మీద కనిపించాలని అనుకున్నాను. అందుకే రెండేళ్లు గ్యాప్ వచ్చింది అంటూ నభా నటేష్ చెప్పుకొచ్చింది.
అలాగే డార్లింగ్ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రం తనకు సరైన కమ్‌బ్యాక్ అవుతుందని నభా ధీమా వ్యక్తం చేసింది. డార్లింగ్ లో ఫన్‌తో పాటు లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ ఉంటాయని చెప్పుకొచ్చింది. కాగా, డార్లింగ్ చిత్రంలో స్లిట్ పర్సనాలిటీ రుగ్మత ఉన్న అమ్మాయిగా నభా నటేష్ కనిపిస్తుంది. ఆమె భర్తగా ప్రియదర్శి యాక్ట్ చేశాడు. ఇప్పటికే వీరి మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషన్స్ ద్వారా మేకర్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.