శివ సినిమాతో నాగార్జునకి జీవిత కాలం స్టార్ డం తెచ్చిపెట్టాడు సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ. తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పుకోవాలంటే శివ సినిమాకి ముందు ఆ తర్వాత అనేంతగా ఆ సినిమా తో రాంగోపాల్ వర్మ తెలుగు సినిమా చరిత్రపై తనదైన ముద్ర వేశారు. తనకు అంత స్టార్డమ్ తెచ్చిన నాగార్జున అదే వర్మ దర్శకత్వంలో తన మేనల్లుడు దర్శకత్వంలో సుమంత్ ని హీరోగా లాంచ్ చేయాలనుకున్నాడు.. అక్కినేని ఫామిలీ కూడా ఇందుకు ఓకే చెప్పేసింది. ఈ నేపథ్యంలోనే ప్రేమకథ సినిమాను ప్రకటించారు.
సుమంత్ హీరోగా అంటే ఆర్జీవీ నాగార్జునలా చాలా సింపుల్‌గా డీల్ చేసేయొచ్చు అనుకున్నాడు. సుమంత్‌కు అదే తొలి సినిమా.. ఆర్జీవీ అప్పటికే బాలీవుడ్లో బ్లాక్బస్టర్లు ఇచ్చిన స్టార్ డైరెక్టర్. అయితే సుమంత్ ఎంత డమ్మీగా ఉన్నాడో మొదటి సినిమాకు ఆర్జీవి ఒక్కడికే బాగా అర్థమైందట. ఆర్జీవికి ఏదైనా క్షణాల్లో అయిపోవాలి… సినిమా సినిమాకు టెక్నీషియన్‌ను అయినా మార్చేస్తాడు.. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్లు కూడా అలా మారిపోతూ ఉంటారు.
అంత స్పీడ్‌గా ఉండే ఆర్జీవీకే సుమంత్ చుక్కలు చూపించేశాడట. హీరోయిన్ అంత్రమాలితో అప్పటికే పీకల్లోతు లవ్‌లో ఉన్న ఆర్జీవి సుమంత్ మొదటి సినిమాకు ఆమెనే హీరోయిన్గా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. షూటింగ్లో మాత్రం సుమంత్ ఆర్జీవికి చుక్కలు చూపించేశాడట. ఒక్కో షాట్‌కు 10 – 15 టేకులు పట్టేవట. ఆర్జీవీ చెప్పిన ఎక్స్ప్రెషన్స్ వచ్చేందుకు సుమంత్ చాలా టేకులు తీసుకున్నాడని అప్పట్లో వినిపించింది.
మామూలుగా అయితే ఆర్జీవికి సుమంత్ పెట్టిన టార్చరే ఇది. అయితే ఎదురుగా తన ప్రియురాలు ఆంత్రమాలి కనిపిస్తుండడంతో సుమంత్ ఎంత ఇబ్బంది పెట్టినా ఓపికతో భరించాడట ఆర్జీవి. ఈ సినిమాకి సందీప్ చౌహతా అందించిన మ్యూజిక్ పెద్ద ఎస్సెట్. దేవుడు కరుణిస్తాడని.. వరములు కురిపిస్తాడని అన్న పాట మ్యూజిక్ లవర్స్‌ను ఇప్పటకీ ఆకట్టుకుంటుంది.