టాలీవుడ్‌లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. వెంకటేష్ సినిమాలు, కుటుంబ కథ సినిమాలు, ఫ్యామిలీ ప్రేక్షకులు అందరూ వెంకటేష్ సినిమాలను ఇష్టపడుతూ ఉంటారు. ఇక హీరోయిన్లలో చాలామంది వెంకీకి అభిమానులుగా ఉన్నారు. ఖుష్బూ, వెంకీ అంటే చాలా ఇష్టపడుతుంది. వెంకీ తొలి సినిమా కలియుగ పాండవులు సినిమాలో ఆమె హీరోయిన్.. దివంగత దివ్యభారతికి వెంకటేష్ ట్రీట్మెంట్ అంటే చాలా ఇష్టం. అలాగే అందాల తార శ్రీదేవికి.. వెంకటేష్ ఆటిట్యూడ్ చాలా బాగా నచ్చుతుంది. వీరు మాత్రమే కాదు వెంకటేష్‌ఖు దగ్గరగా ఉండే టబు, మీనా, సౌందర్య, సిమ్రాన్ ఇలా వీళ్ళందరూ వెంకీని బాగా ఇష్టపడతారు.
నయనతార కి వెంకటేష్ బిహేవియర్ అన్నా.. ఆయన పాటించే స్పిరిచ్యువల్ ఫార్ములాస్ అన్న బాగా ఇష్టం. హీరోయిన్లు మాత్రమే కాదు దర్శకులు.. హీరోలలో కూడా వెంకటేష్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ తరం జనరేషన్ హీరోలలో ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేసిన ఘనత కూడా వెంకటేష్‌కు దక్కుతుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, రామ్ లాంటి హీరోలతో వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలు చేశారు. ఒకానొక టైంలో వెంకటేష్.. మీనా కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మీనా సైతం వెంకటేష్‌తో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపించే వారట.
దర్శక, నిర్మాతలు కూడా వెంకటేష్ – మీనా కాంబినేషన్ అంటే మోజు చూపించేవారు. ఆ తర్వాత సౌందర్య హవా మొదలైంది. సౌందర్య, వెంకటేష్ ది హిట్ ప్లేయర్. వీరి కాంబినేషన్‌లో రాజా, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, జయం మనదేరా, దేవి పుత్రుడు సినిమాలు వచ్చాయి. వెంకటేష్, మీనా కాంబినేషన్‌లో అబ్బాయిగారు, సుందరకాండ, చంటి, దృశ్యం లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అయితే వెంకటేష్.. సౌందర్య జంట సూపర్ హిట్లు కొట్టడం మొదలుపెట్టిందో.. అప్పటినుంచి వెంకటేష్ మీనా కాంబినేషన్‌కు గండిపడింది. సౌందర్య ఎంట్రీతో మీనా తట్టుకోలేకపోయింది అని చెప్పాలి.