టాలీవుడ్లో కొందరు దర్శకులపై హీరోయిన్లు, నటీమణులు కామెంట్లు చేయడం కామన్‌గా జరుగుతూ వస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి గురించి తెలిసిందే. కొన్ని సినిమాల్లో ఆమె వ్యాంప్ రోల్స్ చేసి బాగా పాపులర్ అయ్యింది. ఇక జ్యోతికి ఎవరైనా డైరెక్టర్ పాత్ర ఇచ్చే విషయంలో ఆమెకు ఎక్కువుగా వ్యాంప్ తరహా పాత్రలతో పాటు.. ఎక్స్పోజింగ్ చేసే పాత్రలే ఆఫర్ చేసేవారట.
ఆ పాత్రల్లో నటించేందుకు స్కోప్ ఉంటే జ్యోతి వెంటనే ఓకే చెప్పేసేదట. అయితే కొందరు దర్శకులు ఆమె కోసం మరీ మితిమీరి పోయిన పాత్రలు రాసుకు వచ్చి.. సినిమా ఓకే చెప్పే టైంలో కథ.. ఆమె పాత్రలా ఒకలా చెప్పి.. షూటింగ్ టైంలో మరోలా చెప్పేవారట. అప్పుడు ఆ సీన్లలో నటించేందుకు తాను చాలా ఇబ్బందులు పడే దానిని అని జ్యోతి వాపోయేవారు.
ఈ క్రమంలోనే దివంగత సీనియర్ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన కితకితలు సినిమాలోనూ ఆమెకు ఈవీవీ ఓ పాత్ర ఆఫర్ చేశారట. అందరూ ఉండగానే సీన్ చెప్పకుండా వెళ్లి అక్కడ పైటతీసి పడుకో అన్నారట. ఆయన పెద్ద డైరెక్టర్… ఆయనకు ఎదురు చెప్పే ధైర్యం లేకపోయినా కూడా కాస్త డేర్ చేసి ఈ సీన్ చేయలేనండి అని చెప్పేసిందట. వెంటనే ఈవీవీ కాస్త కోపగించుకుని.. నేను చెపితే కూడా చేయవా ? అని ప్రశ్నించారట.
అయినా జ్యోతి సార్ నాకు కాస్త కంఫర్ట్‌గా ఉండేలా మార్చమని రిక్వెస్ట్ చేసిందట. అలా జ్యోతి ఇబ్బంది అర్థం చేసుకున్న ఈవీవీ ఆ సాన్ను కాస్త మార్చి తీశారట. దీనిని బట్టి మనం బెడ్రూమ్ సీన్లలో ఎంజాయ్ చేసే సీన్లలో నటిస్తున్నప్పుడు ఫీమేల్ యాక్టర్స్ ఎలా ఇబ్బందులు పడతారో అర్థం చేసుకోవచ్చు.