ప్రభాస్.. ఈ పేరు చెబితే ఎవరికైనా సరే రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. ఎందుకంటే ఈయన చేసే సినిమాలు అలా ఉంటున్నాయి. స్టేజ్ మీద మాట్లాడడానికే చాలా మొహమాట పడే ప్రభాస్ సినిమాల్లో మాత్రం ఇరగదీస్తాడు. మరీ ముఖ్యంగా మనదేశంలో మొదటి పాన్ ఇండియా హీరోనే ప్రభాస్. మొదటి పాన్ ఇండియా మూవీ ఈయనదే. అలాంటి ప్రభాస్ ఇప్పటికే బాహుబలి, బాహుబలి 2, కల్కి2898 ఏడి, సలార్ వంటి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా ఎలాంటిదో నిరూపించుకున్నాడు. అయితే అలాంటి ప్రభాస్ గురించి ఓ హీరోయిన్ చాలా దారుణంగా మాట్లాడింది.
అయితే ఇవేవో ఆమె చాటుగా మాట్లాడిన మాటలు కావు డైరెక్ట్ గానే మాట్లాడింది. వీడేం హీరో అవుతాడు అంటూ అప్పట్లో హీరోయిన్ మాట్లాడిన మాటలు సంచలనం సృష్టించాయి. ఇక ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే..బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్.. అవును మీరు వినేది నిజమే. కంగనా రనౌత్ ప్రభాస్ అసలు పెద్ద హీరో కాదు అని అనుకుందట. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో కంగనానే చెప్పింది. అయితే ప్రభాస్ కంగనా రనౌత్ కాంబినేషన్ లో ఏక్ నిరంజన్ సినిమా వచ్చింది.ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ నీ మొట్ట మొదటిసారి కలిసిందట కంగనా.
అయితే ఆ సమయంలో ప్రభాస్ షూటింగ్ సెట్లో ఉన్న వాళ్ళందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉండేవారట. దాంతో ప్రభాస్ ని చూసి ఈయన ఎప్పటికీ పెద్ద గొప్ప హీరో కాలేడు. ఇలా ప్లే బాయ్ గా అందరిని నవ్వుతూ నవ్విస్తూనే ఉంటాడు అని అనుకుందట. ఆ తర్వాత సినిమా విడుదలైన కొద్ది రోజులకు ప్రభాస్ తో కాంటాక్ట్ కూడా పోయిందట. అంతేకాదు ప్రభాస్ నెంబర్ కూడా తన ఫోన్లో ఉంచుకోలేదట. ఇక తర్వాత కొద్ది సంవత్సరాలకి ప్రభాస్ బాహుబలి సినిమా ద్వారా తన నట విశ్వరూపాన్ని చూపించి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు.
ఆ సమయంలో కంగనా ఏంటి నేను చూసిన ప్రభాసేనా..ఈయనలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా.. అని ఆయన నటనకి నేను ఫిదా అయిపోయాను. ప్రభాస్ నట విశ్వరూపాన్ని నేను తక్కువగా అంచనా వేశాను అంటూ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా కంగనానే ఈ విషయాన్ని బయట పెట్టింది. అలా ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు అనే దానికి ప్రభాస్ ఒక ఉదాహరణ అంటూ అప్పట్లో కంగననా రనౌత్ చెప్పుకొచ్చింది.