అతిలోక సుందరి శ్రీదేవి.. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే.. చిరంజీవితో జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా చేశాక అతిలోకసుందరిగా దేశవ్యాప్తంగా పేరుగాంచింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బతికి లేకపోయినప్పటికీ ఈమె సినిమాల రూపంలో అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయింది.అలాంటి శ్రీదేవి మరణం ఎంతో మందిని కలిచివేసింది. అయితే శ్రీదేవి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ,మలయాళ వంటి ఎన్నో భాషల్లో హీరోయిన్ గా రాణించి దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 5 హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ హీరోయిన్ సినీ కెరియర్ చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ పర్సనల్ కెరియర్ మాత్రం అంతా బాగుండదు. ఎందుకంటే ఈమె మొదట మిథున్ చక్రవర్తి తో కొన్ని రోజులు రిలేషన్ లో ఉండి ఆ తర్వాత రెండో పెళ్లి వాడైనా బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుంది.
అయితే శ్రీదేవి జీవితంలోఎన్నో మర్చిపోలేని చెడు సంఘటనలు ఉన్నాయట. అందులో ఒకటే ఇది. అదేంటంటే.. శ్రీదేవిని అందరూ చూస్తుండగానే ఓ హీరో తల్లి చెప్పుతో కొట్టిందట. మరి ఇంతకీ ఆ హీరో తల్లి ఎవరు? ఎందుకు శ్రీదేవిని చెప్పుతో కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది చూద్దాం.. శ్రీదేవిని అందరి ముందే చెప్పుతో కొట్టిన హీరో తల్లి ఎవరో కాదు బోనీ కపూర్ తల్లి. అయితే చెప్పుతో కొట్టడానికి కారణం.. శ్రీదేవి బోనీ కపూర్ కి మొదటి భార్య ఉండగానే ఆయన్ని ప్రేమించింది. ఒక రకంగా చెప్పాలంటే..శ్రీదేవి మీద పిచ్చి ప్రేమ పెంచుకున్న బోనీ కపూర్ ఆమెను దగ్గర చేసుకొని శ్రీదేవి తల్లి మరణించిన సమయంలో చాలా దగ్గరై పెళ్లి కాకుండానే సహజీవ** చేసి ప్రెగ్నెంట్ ని చేశాడు. అలా వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఇండస్ట్రీలో ఉన్నవారు కథలు కథలుగా చెప్పుకోవడంతో ఇది కాస్తా బోనీ కపూర్ తల్లి చెవిన పడింది.
దాంతో తన కోడలు జీవితం నాశనం చేసింది అనే ఉద్దేశంతో శ్రీదేవిని ఓ ఈవెంట్లో బోనీ కపూర్ తల్లి చెప్పుతో కొట్టిందని అప్పట్లో బాలీవుడ్లో టాక్ వినిపించింది.. ఇక అంత పెద్ద ఈవెంట్లో బోనీ కపూర్ తల్లి చేసిన పనికి అవమానంతో అక్కడి నుండి శ్రీదేవి వెళ్లిపోయిందట. ఇక ఈ విషయం మొత్తం తెలిసిన బోనీ కపూర్ మొదటి భార్య ఆయనతో కలిసి ఉండలేక విడాకులు ఇచ్చేసి వెళ్లిపోయింది. ఇక బోనీ కపూర్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చినప్పటికి కూడా మొదటి భార్య పిల్లల్ని చాలా బాగా చూసుకున్నారు. అలా శ్రీదేవి పర్సనల్ కెరియర్ లో ఎన్నో ఇబ్బందులు పడింది.