విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అనగానే అందరికీ సీనియర్ ఎన్టీఆర్ పేరే గుర్తుకు వస్తుంది. జానపద,పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటించి ఎంతో గుర్తింపు సంపాదించారు. ఈయన తెలుగు,తమిళ,గుజరాతి, హిందీ వంటి పలు భాషల్లో దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించారు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్ని కష్టాలు అనుభవించారో చాలామందికి తెలిసే ఉంటుంది.అయితే ఇప్పటి జనరేషన్ వాళ్లకు కూడా కథానాయకుడు సినిమాతో ఈయన సినిమాల కోసం పడ్డ కష్టాలు చూసే ఉంటారు.
అయితే అలాంటి సీనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా స్టారే..
కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అత్యధిక మెజారిటీ సంపాదించి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చారు. అయితే అప్పట్లో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో మంచి పనులు చేశారు. ఇక ఆ సమయంలోనే సీనియర్ ఎన్టీఆర్ పై ఒక సంచలన వార్త బయటపడింది. ఆ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
ఇంతకీ ఆ వార్త ఏంటయ్యా అంటే.. అర్ధరాత్రి పూట సీనియర్ ఎన్టీఆర్ ఆడవాళ్లు కట్టుకునే చీరలు కట్టుకొని క్షుద్ర పూజలు చేస్తున్నారు అంటూ ఒక సంచలన న్యూస్ చక్కర్లు కొట్టడంతో చాలామంది భయపడిపోయారు. అయితే ఈ వార్త పూర్తిగా అవాస్తవమని,సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రాణించడం ఓర్వలేని ప్రతిపక్ష నాయకులే అలా ఎన్టీఆర్ పై కక్ష కట్టి లేనిపోని అవాస్తవాలు, రూమర్లు పుట్టిస్తున్నారని చాలామంది ఈ వార్తను కొట్టి పారేశారు.ఇక అప్పట్లో ఎన్టీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నాడనే వార్త చాలా వైరల్ గా మారింది.
దీనిపై కొంతమంది సీనియర్ విశ్లేషకులు, ఎన్టీఆర్ సన్నిహితులు స్వయంగా స్పందించి ఎన్టీఆర్ ని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఆయనపై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని తిప్పి కొట్టారు. అలా ఎన్టీఆర్ పై ఇలాంటి రూమర్లు ఇదొక్కటే కాదు ఎన్నో వినిపించాయి. కానీ ఈ వార్తలను ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ కంటే ముందే ఎన్టీఆర్ ని దైవంగా భావించే చాలామంది జనాలు, ఆయన సన్నిహితులు తిప్పి కొట్టారు.