Moviesసితార గొప్ప మ‌న‌సు.. ఈసారి బ‌ర్త్‌డేకు ఏం చేసిందో తెలిస్తే ఫిదా...

సితార గొప్ప మ‌న‌సు.. ఈసారి బ‌ర్త్‌డేకు ఏం చేసిందో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి ఘట్టమనేని సితార అందంలో, అభినయంలోనే కాదు దాతృత్వంలోనూ తండ్రికి పోటీ వస్తోంది. ఇతరులకు సాయం చేయడంలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. గత ఎడాది పుట్టినరోజు సందర్భంగా సితార‌ పేదింటి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి బర్త్ డేకి కూడా సితార తన గొప్ప మనసును చాటుకుంది.

జులై 20న తన 12వ పుట్టినరోజు సందర్భంగా సితార మెడిసిన్ చదవాలనుకున్న ఓ పేద విద్యార్థికి ఆర్థికంగా మద్దతు ఇచ్చింది. సదరు విద్యార్థి కలలకు ఊపిరి పోసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నిరుపేద కుటుంబానికి చెందిన నవ్య అనే యువతి నీట్ ఎగ్జాంలో క్వాలిఫై అయ్యింది. డాక్టర్ చదవాలన్నది ఆమె కల. కానీ నవ్యను డాక్టర్ చదివించేంత స్తోమత ఆమె కుటుంబానికి లేదు. అయితే ఈ విషయాన్ని మహేష్ బాబు అభిమానులు మహేష్ బాబు ఫౌండేషన్ కు తెలియజేశారు.

దాంతో నవ్య డాక్టర్ చదివేందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ మరియు సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషన్ ఫండ్ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సితార తన పుట్టినరోజు సందర్భంగా నవ్యకు 1,25,000 రూపాయలు అడ్వాన్స్‌గా చెక్కు రూపంలో అందజేసింది. ల్యాప్‌టాప్ మ‌రియు స్టెతస్కోప్ కు న‌వ్వ‌కు కానుక‌గా ఇచ్చింది.

ఆపై కేక కట్ చేసి తన పుట్టినరోజును నవ్యతో సెలబ్రేట్ చేసుకుంది. దీంతో నవ్య మరియు అతని కుటుంబం సంతోషం వ్యక్తం చేశారు. మహేష్ బాబు ఫౌండేషన్ కు, సితారకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని తాజాగా నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో నేటిజన్లు సితార చేసిన ప‌నికి ఫిదా అవుతున్నారు. వయసు చిన్నదే అయినా సితార హృదయం విశాలమైనది అంటూ పొగిడేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news