మనకు తెలిసిందే.. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ ఆల్ టైం అందరికీ ఫేవరెట్ హీరోగా నిలిచిన ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి . ఇండస్ట్రీలోకి ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చి తన పేరు చెప్పుకొని నలుగురు ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేలా చేసుకున్న ఈ హీరో ప్రెసెంట్ విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది . అయితే తనతో వర్క్ చేసే హీరోయిన్స్ పట్ల చాలా ఫ్రెండ్లీ నేచర్తో మూవ్ అయ్యే చిరంజీవి ఎప్పుడు కూడా హద్దులు మీరిన సంధర్భాలు లేవు.
అల్లరిగా ప్రవర్తిస్తారు ..నాటిగా బిహేవ్ చేస్తారే కానీ ఎక్కడ వల్గారిటీ అనేది ఉండదు . అయితే చిరంజీవి తన కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . కానీ ఒక హీరోయిన్ మాత్రమే ముద్దుగా పెట్ నేమ్ తో పిలిచేవాళ్ళు . ఆమె మరి ఎవరో కాదు సౌందర్య . యస్.. ఇదే న్యూస్ ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతుంది. చిరంజీవి – సౌందర్య కాంబోలో ఎన్ని సినిమాలు వచ్చాయో.. ఎంత పెద్ద హిట్ అయ్యాయి అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు .
వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ చరిత్రను తిరగరాసింది . అయితే సౌందర్యతో ఉన్న చనువు కారణంగా ఆమెను ముద్దుగా సౌ..సౌ అంటూ పిలిచేవారట . మిగతా ఏ హీరోయిన్ ని కూడా పెట్ నేమ్ తో పిలవని చిరంజీవి కేవలం సౌందర్యను మాత్రమే అలా పెట్ నేమ్ తో ఎంతో ప్రేమ పిలిచేవాడట. అతి చిన్న వయసులోనే స్టార్ గా మారిన సౌందర్య అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలికి వెళ్లిపోయింది..!!