సీనియర్ నటి రాధిక అంటే ఇప్పటి జనరేషన్ కి కూడా తెలిసిన హీరోయినే. ఈమె ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ వంటి ఎంతో మంది స్టార్ హీరోలతో నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో చేసింది.రాధిక ప్రొఫెషనల్ లైఫ్ బాగున్నప్పటికీ పర్సనల్ లైఫ్ మాత్రం ఏ మాత్రం బాగుండదు. అయితే రాధిక ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుంది. మొదట ప్రతాప్ పోతేన్ అనే నటుడిని పెళ్లాడింది. ఆ తర్వాత రీఛార్డ్ హార్డీ అనే వ్యక్తిని కూడా రెండో పెళ్లి చేసుకుంది.
ఆ తర్వాత ముచ్చటగా మూడోసారి శరత్ కుమార్ ని పెళ్లాడింది. అయితే ఈమె తన లైఫ్ లో మూడు పెళ్లిళ్లు చేసుకుంటుంది అని ఓ వ్యక్తి ముందే ఊహించి చెప్పారట. మరి ఇంతకీ రాధిక భవిష్యత్ గురించి ముందే చెప్పిన ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. సీనియర్ నటి రాధిక గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో తనకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది. అదేంటంటే.. నాకు రెండు రిలేషన్స్ పాడయ్యి మూడోది బాగుంటుంది అని మా అమ్మ ముందుగానే చెప్పింది. అయితే మా అమ్మ నా జాతకాన్ని ఓ జ్యోతిష్యుడికి చూపించగా ఆయన జాతకం మొత్తం చెప్పేసాడు.
రెండు రిలేషన్స్ పాడయ్యి మూడోది నటుడిని పెళ్లి చేసుకుంటుంది. శరత్ అనే వ్యక్తితో ఆమె జీవితం బాగుంటుందని చెప్పారని కూడా అమ్మ నాతో చెప్పింది. ఇక ఈ విషయం మా అమ్మ నాకు చెప్పగా ఏంటి నటుడా.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అబ్బాయిని నేను అస్సలు చేసుకోను. నో నో అంటూ పెద్ద రచ్చ చేశాను. అలాగే నేను ప్రతాప్ పోతేన్ ని పెళ్లి చేసుకోలేదు సహజీవనం మాత్రం చేసాను అంతే. జ్యోతిష్యుడు చెప్పినట్టు నా జీవితంలో ఎవరైతే శరత్ అనే పేరు మీద వస్తారని అన్నారో అలాగే నా జీవితంలో శరత్ కుమార్ వచ్చారు అంటూ ఆ ఇంటర్వ్యూలో రాధిక చెప్పుకొచ్చింది. అలా ఆమె జాతకం ప్రకారం ఆమె లైఫ్ మొత్తాన్ని ఆ జ్యోతిష్యుడు ముందుగానే ఊహించి చెప్పారట.