ఏంటి ప్రేమించిన హీరోకి సమంత రాఖీ కడతానని బెదిరించిందా? సమంత చైతన్య ను అంత గాఢంగా ప్రేమించి రాఖీ కడతానని బెదిరించడం ఏంటి.. వింటుంటేనే చాలా విడ్డూరంగా ఉంది అని అనుకుంటున్నారు కదూ.. అయితే ఇది నిజమేనట. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరి ఇంతకీ చైతన్యకు రాఖీ కడతానని సమంత బెదిరించడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఏ మాయ చేసావే సినిమాలో ఏర్పడ్డ ఫ్రెండ్షిప్ సమంత.. నాగచైతన్యలను పీకల్లోతు ప్రేమలో పడేసింది.అలా వీరిద్దరూ తమ ప్రేమని కంటిన్యూ చేస్తూనే ఎవరికి దొరకకుండా చాలా జాగ్రత్తగా రిలేషన్ కొనసాగిస్తూ ఓవైపు సినిమాల్లో కూడా దూసుకుపోయారు.
అయితే నాగచైతన్య ఇప్పుడిప్పుడు సినిమాల్లో హిట్ కొడుతున్నాడు. కానీ సమంత మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలా టాప్ హీరోయిన్ గా ఎదిగిన సమంతపై రూమర్స్ మొదలయ్యాయి.ఇక ఎంత పెద్ద మ్యాటర్ అయినా ఏదో ఒక సమయంలో బయటపడక తప్పదు.అలా సమంత సినిమాలు హిట్ అవుతున్న సమయంలో సమంత,నాగచైతన్య మధ్య ఏదో నడుస్తోంది అనే రూమర్ మెల్లిమెల్లిగా వినిపించి చివరికి టాలీవుడ్ అంతా పాకింది.
దాంతో అలర్ట్ అయిన సమంత నాగచైతన్యని ఇంటికి పిలిపించుకొని ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరుగుతుంది. మన లవ్ మ్యాటర్ ఇండస్ట్రీ మొత్తం పాకింది. ఇప్పుడు దీని గురించి మనం ఎన్ని కట్టు కథలు చెప్పినా కూడా నమ్మేలా లేరు. అందుకే మనం పెళ్లి చేసుకుందాం అని నాగచైతన్యతో చెప్పిందట. కానీ పెళ్లంటే భయపడిపోయిన నాగచైతన్య వామ్మో ఇప్పుడే పెళ్లా కొద్దిరోజులు టైం తీసుకుందాం. నేను ఇంకా సెట్ అవ్వలేదు ఇంట్లో వాళ్లకు కూడా మన విషయం చెప్పలేదు అని అన్నారట.
దానికి కోపంతో సమంత అవునా అలా అయితే ఇప్పుడే నీకు రాఖీ కట్టేస్తాను తర్వాత ఎవరినైనా పెళ్లి చేసుకో అంటూ బెదిరించిందట. ఇక సమంత మాటలకు బెదిరిపోయిన నాగచైతన్య వెంటనే నాగార్జునకి ఈ విషయం చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.ఇక ఈ విషయాన్ని నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టి సమంత రాఖీ కడతానని నన్ను అలా బెదిరించింది అంటూ అప్పటి విషయాన్ని గుర్తు చేసుకొని నవ్వుకున్నారు.