Moviesఆ విషయంలో పవన్ కళ్యాణ్ హెల్ప్ తీసుకోబోతున్న సమంత.. పాత బంధం...

ఆ విషయంలో పవన్ కళ్యాణ్ హెల్ప్ తీసుకోబోతున్న సమంత.. పాత బంధం బలపడబోతుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ సమంత త్వరలోనే డిప్యూటీ సీఎం గా అధికారం చేపట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలవబోతుందా ..?అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . అయితే అది సినిమాలపరంగా కాదు పర్సనల్ లైఫ్ పరంగా కూడా కాదు .. ప్రజలకు ఉపయోగపడే ప్రకారంగానే.. సమంత పవన్ కళ్యాణ్ ను కలవబోతుందట . ఓ విషయంలో పవన్ కళ్యాణ్ హెల్ప్ తీసుకోబోతుందట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు తెలుగు సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. సమంత ఇండస్ట్రీలో హీరోయిన్గా చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేసింది .

అత్తారింటికి దారేది అంటూ ఒక సినిమాలో నటించి సెన్సేషనల్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సమంత బయటపెద్దగా మీట్ అయింది లేదు. కలిసి సినిమాలో నటించింది కూడా లేదు. ఆ సినిమా చేసినప్పుడు మాత్రం వీళ్ళ ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్ గా ఉండింది. ఆ తర్వాత అది దూరమైపోయింది . ఆ తర్వాత సమంత విడాకులు తీసేసుకోవడం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా అధికారం చేపట్టిన తర్వాత సమంత ఆయనను కలవబోతుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

సమంతకి నేచర్ అంటే చాలా చాలా ఇష్టం . మూగజీవులు అన్న ..పచ్చటి పొలాలు అన్న ..నేచర్ అన్న చాలా ఎంజాయ్ చేస్తుంది. అదేవిధంగా నేచర్ ని కాపాడడానికి చూస్తుంది.. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అదే క్వాలిటీస్ కలిగిన వ్యక్తి .. ప్రకృతి అన్న సమాజసేవ అన్న మూగజీవులు అన్న ఆయన బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు .. ఒకప్పుడు అంటే పవన్ కళ్యాణ్ చేతిలో అధికారం లేదు .. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ఖచ్చితంగా ఆయన హెల్ప్ తీసుకుంటే సమంత అనుకున్న పని సాధించగలరు ..నేచర్ ఇంకా బాగా గ్రీనరీగా మారడానికి చెట్లు నరకకుండా ఉండడానికి ప్రజలు హెల్తి ఫుడ్ హెల్ది డైట్ ఫాలో అవ్వడానికి కొన్ని కొన్ని విషయాలు సమంత పవన్ కళ్యాణ్ కి సూచించబోతుందట . మయోసైటిస్ లాంటి రేర్ డిసీజెస్ బారిన పడకుండా కొన్ని కొన్ని హెల్త్ కాన్షియస్ టిప్స్ తీసుకుంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది అని సరికొత్త పద్ధతిని ఇన్వాల్వ్ చేసే విధంగా ముందుకు వెళ్ళబోతున్నారట . పవన్ కళ్యాణ్ ఆమెకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news