Moviesఫైన‌ల్ గా అనుకున్న‌ది సాధించిన సాయి ప‌ల్ల‌వి.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!

ఫైన‌ల్ గా అనుకున్న‌ది సాధించిన సాయి ప‌ల్ల‌వి.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన సహజ నటన మరియు అందంతో న్యాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి.. ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తోంది. ఇదిలా ఉండగా.. సాయి పల్లవి తాజాగా తను అనుకున్నది సాధించింది. ఫైనల్ గా సాయి పల్లవి డాక్టర్ సాయి పల్లవిగా ప్రమోట్ అయింది.

ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు మెడిసిన్ చదువుకుంటున్న సంగతి అందరికీ తెలుసు. నటిగా రిటైర్ అయిన తర్వాత డాక్టర్ గా స్థిరపడాలనేది సాయి పల్లవి ఫ్యూచర్ ప్లాన్. అందులో భాగంగానే మెడిసిన్ ను కంప్లీట్ చేసింది. తాజాగా జార్జియాలోని టీబీలీసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ డేకు హాజరైన సాయి పల్లవి.. వేదికపై డాక్టర్ పట్టాను అందుకుంది.

అలాగే తనతో పాటు చదువుకున్న స్నేహితులు మరియు అధ్యాపకులతో కాసేపు టైం స్పెండ్ చేసి వారితో ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నాచురల్ బ్యూటీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. మా సాయి పల్లవి డాక్ట‌ర్ అయ్యిందిరోయ్‌ అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు..

కాగా, సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో సాయి పల్లవి నాగచైతన్యకు జోడిగా తండేల్‌ మూవీలో నటిస్తోంది. అలాగే తమిళంలో శివ కార్తికేయన్ తో కలిసి అమరన్ అనే మూవీ చేస్తుంది. మరోవైపు బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న రామాయణంలో సీత పాత్రను సాయి పల్లవి పోషిస్తుంది. మ‌రియు అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంట‌గా హిందీలో ఒక సినిమా చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news