ముస్లిం కుటుంబంలో పుట్టి పెరిగిన సదా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. అయితే అలాంటి బ్యూటీ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా జయం బ్లాక్ బస్టర్..అలాగే తమిళంలో విక్రంతో కలిసి చేసిన అపరిచితుడు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అటు తెలుగు ఇటు తమిళ సినిమాల్లో చాలా సంవత్సరాలు స్టార్ హీరోయిన్ గా రాణించింది. అంతే కాకుండా కన్నడ,హిందీ సినిమాల్లో కూడా సదాకి అవకాశాలు వచ్చాయి.
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ 40 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఇంకా పెళ్లికి దూరంగానే ఉంటుంది. దాంతో చాలామంది అసలు సదా కి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ విషయంపై సదా ఎన్నో ఇంటర్వ్యూలలో క్లారిటీ ఇస్తూ మంచి వ్యక్తి దొరికితే ఖచ్చితంగా చేసుకుంటాను అని చెబుతుంది.కానీ ఇప్పటివరకు ఆమె పెళ్లి చేసుకున్నది లేదు. మనం చూసింది లేదు అన్నట్లుగా ఉంది.అయితే సదా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కోలీవుడ్ లో ఓ హీరో అని తెలుస్తోంది. అయితే సినిమాల్లో నటించే సమయంలో ఆ కోలీవుడ్ హీరోతో ప్రేమలో పడిన సదా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటుంది..
అయితే ఆ హీరోకి పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ సదా మాత్రం ఆ హీరో చేసిన మోసం వల్ల ఇంకా పెళ్లికి దూరంగానే ఉందట. ఎందుకంటే అంత గాఢంగా ప్రేమించిన హీరో తనని వదిలేసేసరికి సదా కి పెళ్లి పై నమ్మకం పోయినట్టు తెలుస్తోంది. అయితే ఓ ఇంటర్వ్యూలో సదా పెళ్లి విడాకుల గురించి మాట్లాడుతూ పెళ్లి చేసుకున్నాక లైఫ్ కష్టమనిపిస్తే ఖచ్చితంగా విడాకులు తీసుకుంటాను. అలాగే నేను లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటాను అని కూడా చెప్పింది. మరి చూడాలి సదా ఈ ఏడాదైనా పెళ్లి చేసుకుంటుందో లేదో.. !