చాలామంది హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో పాపులారిటీ తెచ్చుకుని ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి.. అక్కడ స్టార్ హీరోయిన్గా కొనసాగాలని ఆశపడుతూ ఉంటారు. కొందరు హీరోయిన్లు ఉండేది ముంబై అయినా కూడా.. వారి కన్ను ఎప్పుడు టాలీవుడ్ మీదే ఉంటుంది. బాలీవుడ్‌లో అవకాశాలు అంత త్వరగా రావు. అందుకే తెలుగులోకి వచ్చి ఇక్కడ పాపులరై.. ఇక్కడ హిట్లు కొట్టి ఆ తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసి అక్కడ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. శ్రీదేవి లాంటి దేశాన్ని ఊపేసిన స్టార్ హీరోయిన్ సైతం.. ముందుగా టాలీవుడ్‌లో సక్సెస్ అయ్యాక.. బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఎదిగిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ లో 2000 సంవత్సరంలో దివంగత ఉదయ్ కిరణ్ హీరోగా.. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన సూపర్ హిట్ సినిమా చిత్రం. తేజ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యారు. ఈ సినిమాతో రీమాసేన్ హీరోయిన్గా పరిచయం అయింది. ఈ సినిమా సూపర్ హిట్. ఇక ఈ సినిమాతో తెలుగు కుర్రకారు హృదయాల్లో ప్రేమ గిలిగింతలు పెట్టేసింది. ఆ తర్వాత మనసంతా నువ్వే, వీడే, బావనచ్చాడు, బాలయ్యతో సీమసింహం వరుస పెట్టి మంచి అవకాశాలు సొంతం చేసుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని మంచి అవకాశాలు వచ్చినా.. ఎందుకో ఆమె అన్నీ ఒప్పుకోలేదు.
అదే టైంలో ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఆశలు పెట్టుకుంది. అక్కడ ఫర్దీన్ ఖాన్ తో ఒక సినిమా చేసింది. ఆ సినిమా బాలీవుడ్ లో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా అక్కడ అవకాశాలు రాలేదు. అప్పటికే చాలామంది కొత్త హీరోయిన్లు వచ్చి బాలీవుడ్‌ను ఏలేస్తున్నారు. ఆ టైంలో రీమా ఫిజికల్‌గా చాలా లావుగా మారిపోయింది.. ఫేస్‌లో చాలా మార్పులు వచ్చాయి. అటు హిందీలో, ఇటు తెలుగులో హీరోయిన్గా ఛాన్సులు రాక చాలా త్వరగా తెరమరుగైపోయింది. రీమాసేన్ ఫామ్‌లో ఉన్న టైంలో.. బాలీవుడ్ వైపు చూడకుండా ఉండి ఉంటే తెలుగులో ఆమె పదేళ్లపాటు మంచి ఫామ్ లో ఉండేది. కానీ ఆమె వేసిన బాలీవుడ్ అనే రాంగ్ స్టెప్ ఆమె కెరీర్‌ను నాశనం చేసింది.