Moviesర‌వితేజ ' మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ' బిజినెస్‌... రేటు చూస్తే మంటెక్కిపోతోందిరో..?

ర‌వితేజ ‘ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ‘ బిజినెస్‌… రేటు చూస్తే మంటెక్కిపోతోందిరో..?

మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్. గత కొన్ని సినిమాలు చూస్తే రవితేజ వరుసగా డిజాస్టర్లు ఇస్తున్నారు. అందువలన మార్కెట్ పూర్తిగా పడిపోయింది. అయితే మిస్టర్ బచ్చన్ సినిమాకు కొంతవరకు బజ్ వచ్చింది. అందుకే మార్కెట్‌లో డిస్కషన్లు మొదలయ్యాయి. అమ్మకాల బేరాలు మొదలుపెట్టారు. నిర్మాతలు ముందుగా సింగల్ కాపీని సేల్ కింద అమ్మాలని అనుకున్నారు. రూ.35 కోట్ల దగ్గర రేటు కోట్‌ చేశారు. అయితే బయ్యర్ల నుంచి బేరాలు మొదలయ్యాయి. దీంతో ఏరియాల వారీగా బిజినెస్ చేయాలని నిర్మాతలు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

ఆంధ్ర రూ.18 కోట్లు.. నైజాం రూ.18 కోట్లు కోట్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. సీడెడ్ కూడా దాదాపు రూ.15 కోట్ల రేంజ్‌లో చెపుతున్నారట. దర్శకుడుతో ఉన్న అటాచ్మెంట్‌తో తనకు నైజాం హక్కులు ఇవ్వాలని దిల్‌రాజు పట్టుబడుతున్నారు. మరోపక్క ఆషియన్ సురేష్ సంస్థ పోటీలో ఉంది. మైత్రి సంస్థకు, పీపుల్స్ మీడియాకు అనుబంధం ఉండడంతో వాళ్లు కూడా నైజం హక్కుల కోసం భేరసారాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అయితే నైజాం హక్కుల కోసం పోటీ ఎక్కువగా ఉన్న ఎవరూ కూడా నిర్మాతలు చెప్పిన రేటు ఇచ్చేందుకు సుముఖంగా లేరు.

ఆంధ్ర రూ.14 కోట్లు ఇస్తారని అంటున్నా.. అంతా అయినా వస్తుందా..? రాదా..? అన్న సందేహం కూడా ఉంది. నైజాం విషయంలో రూ.10 నుంచి రూ.12 కోట్ల మధ్య చర్చలు నడుస్తున్నాయి. అయితే ఆ రేట్లకు సినిమాను అమ్మటానికి నిర్మాతలు సిద్ధంగా లేరు. బయ్యర్లు ఎవరన్నది ఫిక్స్ అయింది. కానీ.. రేట్‌లు, అగ్రిమెంట్లు తేలాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను సంస్థకు ఇస్తున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా ప్రీమియర్లు ఉంటాయని తెలుస్తోంది. ఇటీవల కాలంలో రవితేజ సినిమాకు ఈ మాత్రం మార్కెట్ రావటం అంటే గొప్ప విషయమే. కానీ రేట్లు చూసి బయ్యర్లకు మంట ఎక్కిపోతుందన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news