Moviesమెగా కుటుంబంలోకి రష్మిక మందన్నా..ఫ్యాన్స్ కి నేషనల్ క్రష్ ఊహించని సర్ప్రైజ్..!?

మెగా కుటుంబంలోకి రష్మిక మందన్నా..ఫ్యాన్స్ కి నేషనల్ క్రష్ ఊహించని సర్ప్రైజ్..!?

ఈ మధ్యకాలంలో రష్మిక మందన్నా.. స్పాట్ డెసిషన్స్ ఎక్కువగా తీసుకుంటుంది . ఆ విషయాలు కూడా మనం ఎక్కువగా సోషల్ మీడియాలో వింటూ వస్తున్నాం. మరీ ముఖ్యంగా రీసెంట్గా రష్మిక మందన్నా తీసుకున్న ఒక నిర్ణయం అభిమానులకి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . మనకు తెలిసిందే.. రష్మిక మందన్నా సీనియర్ హీరోస్తో నటించడానికి ఇష్టపడదు .. ఆమెకున్న క్రేజ్ పాపులారిటీ దృష్ట్యా రష్మిక మందన్నా.. యంగ్ హీరోస్తో నటించడానికి ఇష్టపడుతుంది. ఇప్పటివరకు అలాంటి మూవీస్ ని చూస్ చేసుకుంది . అయితే ఇప్పుడు రష్మిక తీసుకున్న నిర్ణయం ఫాన్స్ కి షాకింగ్ అనిపిస్తుంది .

రష్మిక చిరంజీవితో నటించడానికి సిద్ధపడిందట. ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్లో బాగా ట్రెండ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆల్రెడీ త్రిష హీరోయిన్ గా సెలెక్ట్ అయింది . అయితే ఈ సినిమాలో గెస్ట్ పాత్ర కోసం రష్మిక మందన్నాను అప్రోచ్ అయ్యాడట డైరెక్టర్ వశిష్ట . ఇది మొత్తం చిరంజీవి ప్రమేయంలోనే జరిగిందట . రష్మిక మందన్నా ఆ పాత్రకి బాగా సూట్ అవుతుంది అని ..పైగా సినిమాకి మంచి బజ్ కూడా క్రియేట్ అవుతుంది అని మెగాస్టార్ చిరంజీవినే ఆ పాత్ర కోసం రష్మిక అయితే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేశారట.

వశిష్ట అడిగి అడగగానే రష్మిక ఓకే చేయడం గమనార్హం . గతంలో బాలయ్య సినిమాలో ఇలా గెస్ట్ పాత్రలో నటించమంటే రష్మిక రిజెక్ట్ చేసింది. కానీ చిరంజీవి సినిమాలో మాత్రం నటించడానికి ఓకే చేసింది . దీనితో నందమూరి ఫ్యాన్స్ ఆమె పట్ల గుర్రుగా ఉన్నారు . అంతేకాదు బుచ్చిబాబు సనా రామ్ చరణ్ కాంబోలో రాబోయే సినిమాలోను హీరోయిన్గా సెలెక్ట్ అయింది రష్మిక మందన్నా అంటూ ప్రచారం జరుగుతుంది . ఇలా బ్యాక్ టు బ్యాక్ మెగా హీరోలతో నటిస్తూ మెగా కుటుంబానికి దగ్గర అయిపోతుంది రష్మిక మందన్నా. గతంలో కాజల్ అగర్వాల్ సైతం ఇదేవిధంగా చేసి తన కెరీర్ ని ఎలా మార్చుకునిందో అందరికీ తెలిసిందే . ఇప్పుడు ఆ లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news