Moviesసెన్షేష‌న‌ల్ న్యూస్‌... ఆ హీరోయిన్ ప్రియుడితో ర‌ష్మిక డేటింగ్‌... !

సెన్షేష‌న‌ల్ న్యూస్‌… ఆ హీరోయిన్ ప్రియుడితో ర‌ష్మిక డేటింగ్‌… !

రష్మిక మందన్నా పేరు వినగానే అందరికీ విజయ్ దేవరకొండ కూడా గుర్తుకు వస్తారు.ఎందుకంటే వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు టాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే గీత గోవిందం సమయం నుండే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి ఇప్పటికి కూడా వీరు లవ్ ని కంటిన్యూ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇండస్ట్రీలో ఉన్న ఎవరిని అడిగినా కూడా రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు లవర్స్ అనే చెబుతారు. అయితే తాజాగా ఓ విషయం వినిపిస్తోంది. అదేంటంటే..రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ తో కాకుండా ఆ హీరోయిన్ లవర్ తో డేటింగ్ చేస్తున్నట్టు ఓ న్యూస్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

మరి రష్మిక విజయ్ ని వదిలేసి ఎవర్ని తగులుకుంది. నిజంగానే ఆ హీరోయిన్ లవర్ తో ఈమె డేటింగ్ చేస్తుందా అనేది ఇప్పుడు చూద్దాం…రష్మిక విజయ్ దేవరకొండలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంటగా.. లవ్ బర్డ్స్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే రష్మిక విజయ్ ని కాకుండా మొదట రక్షిత్ శెట్టి అనే కన్నడ హీరోని పెళ్లి చేసుకోవాలనుకొని ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది.కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.ఆ తర్వాత గీత గోవిందం నుండి విజయ్ దేవరకొండ తో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది.

అయితే విజయ్ దేవరకొండ తర్వాత రష్మిక ఓ హీరోతో డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ హీరో ఎవరంటే గుజరాత్ కి చెందిన యానిమేషన్ దర్శకుడు.. నటుడు.. అయినటువంటి చిరంజీవి మక్వానాతో రష్మిక డేటింగ్ చేసినట్టు ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఇది ఇప్పటిది కాదు 2020 సమయం లోనే వీరిద్దరి డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అంతకంటే ముందే చిరంజీవి మక్వానాతో అనుపమ పరమేశ్వరన్ రిలేషన్ లో ఉందనే వార్తలు వినిపించాయి.

దాంతో రష్మిక కి కూడా చిరంజీవి మక్వానాతో రిలేషన్ వార్తలు వినిపించడంతో అనుపమ లవర్ తో రష్మిక డేట్ చేస్తుందనే వార్త ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే వారికి బ్రేకప్ జరిగినట్టు కూడా న్యూస్ వినిపించింది. అలా ప్రస్తుతం చిరంజీవి మక్వానాతో అనుపమ పరమేశ్వరన్, ఇటు రష్మిక మందన్నా ఇద్దరు విడిపోయారని తెలుస్తోంది. ప్రజెంట్ ఆయన మెహ్రీన్ ఫిర్జాదాతో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news