దగ్గుబాటి హీరో రానా.. విజువల్ ఎఫెక్ట్ సమన్వయకర్తగా పనిచేసిన ఈయన సినిమాల్లోకి వచ్చి హీరోగా స్టార్ అయ్యారు. అంతేకాదు తన కటౌట్ తో విలనిజంలో కూడా మెప్పించారు. బాహుబలి, భీమ్లా నాయక్ వంటి సినిమాలతో రానా నెక్స్ట్ లెవెల్ విలన్ గా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా రానా నాయుడు వెబ్ సిరీస్ ద్వారా రీసెంట్గా ఇండియన్ టెలి అవార్డు 2024 ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.
అయితే అలాంటి రానా జీవితంలో ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నాయి.
ముఖ్యంగా దగ్గుబాటి ఫ్యామిలీలో దగ్గుబాటి అభిరామ్ శ్రీరెడ్డి కారణంగా మీడియాలో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.ఈ విషయం పక్కన పెడితే..గతంలో దగ్గుబాటి రానా ఓ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించారట. కానీ ఆ హీరోయిన్ ని రానా పెళ్లి చేసుకోలేక పోయారు. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు ఆ హీరోయిన్ ని రానా వివాహం చేసుకోలేక పోయారు అనేది ఇప్పుడు చూద్దాం.. దగ్గుబాటి రానా ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దిరోజులకే ఓ ఈవెంట్లో నటి శ్రియతో పరిచయం ఏర్పడిందట. అయితే వీరి పరిచయం కాస్త ప్రేమ వరకు దారి తీసి చాలా రోజులు డేటింగ్ చేశారట.
కానీ ఆ తర్వాత ఈ విషయం రానా తండ్రి సురేష్ బాబు కి తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లతో సాన్నిహిత్యంగా ఉండడం, పెళ్లి చేసుకోవడం వంటివి చేయకూడదు. ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్లతో పెళ్లంటే కష్టం. వారి బంధం ఎక్కువ రోజులు నిలవదు. ఇద్దరు ఒకే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు కాబట్టి ఇద్దరి మధ్య చిన్నచిన్న విషయాలకే ఎక్కువ గొడవలు అయిపోతాయి. అది వర్కౌట్ అవ్వదు అని రానా తో చెప్పారట. అంతేకాదు ప్రేమ గీమా పక్కన పెట్టి సినిమాల మీద ఫోకస్ పెట్టమని గట్టిగా మందలించారట. దాంతో తండ్రి మాటలు కాదనలేని రానా,శ్రియతో బ్రేకప్ చేసుకొని మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారట. అలా సురేష్ బాబు కారణంగా రానా, శ్రియాల మధ్య బంధం చెడినట్టు అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి.