టాలీవుడ్ ని దాదాపు రెండు దశాబ్దాలు ఏలిన చిరంజీవి వారసత్వంగా ఇండస్ట్రీలోకి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత మూవీ తో ఎంట్రీ ఇచ్చారు. ఇక తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అయ్యారు. ఒకప్పుడు చిరు కొడుకు చరణ్ అనేవారు.కానీ ఇప్పుడు రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అనే లెవెల్ కి రామ్ చరణ్ ఎదిగారు అంటే ఇది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి రామ్ చరణ్ ఉపాసన కంటే ముందే ఆ హాట్ బ్యూటీ ని రహస్యంగా పెళ్లి చేసుకున్నారా అనేది ఇప్పుడు చూద్దాం..
రామ్ చరణ్ ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఉపాసన రామ్ చరణ్ లు ముందు మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు.ఆ తర్వాత వీరి మధ్య ప్రేమ చిగురించిందట. అయితే వీరి పెళ్లి కాకముందు ఓ హీరోయిన్ ని రామ్ చరణ్ రహస్యంగా పెళ్లి చేసుకొని హనీమూన్ కి కూడా తీసుకువెళ్లారని వార్తలు వినిపించాయి. ఇక హీరోయిన్ ఎవరో కాదు రామ్ చరణ్ చిరుత మూవీ హీరోయిన్ నేహా శర్మ. అయితే ఇండస్ట్రీలో ఉన్న హీరోలపై రూమర్స్ అనేవి కామన్. అలాగే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన రామ్ చరణ్ పై కూడా ఈ రూమర్ వైరల్ అయిందట.
రామ్ చరణ్ నేహా శర్మతో క్లోజ్ గా ఉన్న ఫోటోలను మీడియాలో వైరల్ చేస్తూ ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకొని హనీమూన్ కి కూడా వెళ్లారనే వార్తలు ప్రచారం చేశారు.అయితే ఈ వార్తలపై అటు నేహ గానీ ఇటు రామ్ చరణ్ గానీ క్లారిటీ ఇవ్వలేదు. దాంతో నిజంగానే రామ్ చరణ్ కి నేహాతో ఎఫై** నడుస్తుందని అందరూ భావించారు. అయితే ఈ విషయంపై రామ్ చరణ్ రూమర్ వైరల్ అయ్యాక రెండు సంవత్సరాలకి నోరు విప్పారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఆ హీరోయిన్ ని రహస్యంగా పెళ్లి చేసుకొని హనీమూన్ కు తీసుకెళ్లినట్టు వార్తలు వినిపించాయి.
కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.అలాగే మా నాన్న ఈ వార్తలపై పెద్దగా రియాక్ట్ అవ్వద్దు అని చెప్పారు. ఎందుకంటే హీరోలపై నార్మల్ గా ఇలాంటి న్యూస్ వైరల్ అవుతాయి పట్టించుకోవద్దు అని చెప్పారు. ఇక మా ఇంట్లో వాళ్లకు కూడా ఈ న్యూస్ వైరల్ అయిన సమయంలో అస్సలు భయపడవద్దు. ఇదంతా పుకారే అని చెప్పాను. అంతేకాదు నన్ను ప్రేమించిన ఉపాసనకి కూడా ఈ విషయంలో నేను సర్ది చెప్పాను.. ఆమె కూడా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అని నన్ను అర్థం చేసుకుంది అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.