స్టార్ యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమని ఇప్పటివరకు యాంకరింగ్ లో బీట్ చేసిన వారు ఎవరూ లేరు. ఈమె తన యాంకరింగ్ తో ఎంతోమందిని కట్టి పడేస్తుంది. ముఖ్యంగా ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ లైనా,హీరోలైన ఉండని ఆమె తన మాటలతో వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.ఇక సుమతో ఏదైనా ఇంటర్వ్యూలో మాట్లాడాలంటే వచ్చిన వారికి పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. అయితే అలాంటి సుమ ఇండస్ట్రీలో ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నటువంటి రాజీవ్ కనకాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
వీరికి ఓ కొడుకు కూతురు కూడా ఉన్నారు. ఇక రీసెంట్ గానే సుమ కొడుకు కూడా హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే అప్పట్లో రాజీవ్ కనకాల, సుమ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని ఎంతలా కుదిపేసిందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా చాలామంది సుమ అభిమానులైతే అసలు ఆమె ఎందుకు విడాకులు తీసుకుంటుందో తెలియక బాధపడ్డారు. అయితే అప్పట్లో సుమ రాజీవ్ కనకాల విడాకులు తీసుకోవడానికి కారణం ఓ హీరోయిన్ అని,రాజీవ్ కనకాల ఓ హీరోయిన్ తో సినిమాలో నటించే సమయంలో ఇద్దరి మధ్య క్లోజ్నెస్ పెరగడంతో దాని గురించి ఇండస్ట్రీలో కథలు కథలుగా మాట్లాడుకున్నారు.
దాంతో ఈ విషయం కాస్త యాంకర్ సుమ చెవిన పడడంతో భర్తని అమితంగా ప్రేమించే సుమ ఆ రూమర్స్ ని సహించలేకపోయిందట. మరీ ముఖ్యంగా తన భర్త వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉండడం ఇష్టం లేని సుమ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుందట. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు వీరిద్దరి మధ్య ఉన్న దూరం తగ్గిపోయింది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు,వీరి సన్నిహితులు నువ్వు కూడా ఇండస్ట్రీలోనే ఉంటున్నావ్.ఇండస్ట్రీలో ఎలాంటి న్యూస్ వైరల్ అవుతుందో మీకు తెలియదా అంటూ సుమకు నచ్చజెప్పారట.
అయితే ఓ సమయంలో విడాకులు కూడా తీసుకోవాలనుకున్నప్పటికీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాటిని పక్కకు పెట్టి భార్యాభర్తలు గా కలిసి ఉంటున్నామని సుమ ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. అలా కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగినప్పటికీ మళ్లీ అవి కేవలం రూమర్సే అని తెలిసి సుమ రాజీవ్ కనకాల ఇద్దరు కలిసి పోయారు.