Moviesమ‌హేష్ బాబు చేసిన ప‌నికి రాజ‌మౌళి అప్సెట్‌.. మ‌రీ మ‌రీ చెప్పినా...

మ‌హేష్ బాబు చేసిన ప‌నికి రాజ‌మౌళి అప్సెట్‌.. మ‌రీ మ‌రీ చెప్పినా విన‌లేదా..?

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో SSMB29 వ‌ర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం రాజమౌళి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ‌ అందిస్తుండగా.. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. అయితే ఇంతలోనే మహేష్ బాబు చేసిన ఒక పనికి రాజమౌళి చాలా అప్సెట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రాజమౌళితో చేయబోయే సినిమా కోసం మహేష్ బాబు తన మేకోవర్ మార్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అతను పలుమార్లు విదేశాలకు వెళ్ళాడు. జుట్టు, గ‌డ్డం బాగా పెంచాడు. ఫిజిక్ పరంగానూ చాలా మారాడు.

తన సినిమాలో మనుపెప్పుడూ చూడని కొత్త మహేష్ ను చూపించాలని రాజమౌళి ఆరాటపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు లుక్ ను అప్పుడే రివీల్ చేయకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని మహేష్ కు మరీ మరీ చెప్పార‌ట‌. మీడియాకు దూరంగా ఉండమని సూచించారట. కానీ మహేష్ మాత్రం రాజమౌళి మాట‌లు విన‌కుండా ఆయ‌న‌ కండిషన్ ను బ్రేక్ చేశాడు. ఇటీవల అనంత్ అంబానీ, రాధిక మార్చంట్ వివాహానికి ఫ్యామిలీతో కలిసి హాజరయ్యాడు.

సరికొత్త లుక్ లో సూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తూ అంబానీ ఇంట పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. వేల కోట్లు పెట్టి పెళ్లి చేసుకున్న అనంత్ అంబానీ కన్నా సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫేవరే ఎక్కువగా కనిపించింది. ఇక ఇదే తరుణంలో మహేష్ బాబు లుక్ లీక్ అవ్వడంతో రాజమౌళి ఫుల్ అప్సెట్ అయ్యారట. ఈ క్ర‌మంలోనే మహేష్ బాబుకు ఫోన్ చేసి సున్నితంగా క్లాస్ పీకారని.. ఇకపై ఇటువంటివి రిపీట్ చేయొద్దని రాజమౌళి స్ట్రాంగ్ గా చెప్పారని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news