సౌత్ హీరోయిన్ సీనియర్ నటి రాధిక అంటే అందరికీ సుపరిచితమే.ఈమె హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక కూడా స్టార్ హీరో హీరోయిన్లకు తల్లిగా, పిన్నిగా,అత్తగా ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతోంది.అయితే అలాంటి రాధిక మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. మొదట ప్రతాప్ పోతెన్ అనే నటుడిని పెళ్లి చేసుకొని ఆయనకు విడాకులు ఇచ్చి ఆ తర్వాత రిచర్ట్ హార్డీ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది.కానీ ఈ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు.
ఆ తర్వాత తన సహ నటుడు అయినటు వంటి శరత్ కుమార్ ని ప్రేమించి పెళ్లాడింది. ఇక శరత్ కుమార్ కి కూడా మొదట పెళ్ళై విడాకులు అయ్యాయి. అయితే శరత్ కుమార్, రాధిక ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో ఓ హీరోయిన్ వల్ల రాధిక వైవాహిక బంధం ఇరుకున పడిందట. ఇక ఆ హీరోయిన్ ఎవరంటే.. నటి నగ్మా. ఇండియాలో స్టార్ హీరోయిన్ గా హిందీ, తెలుగు,తమిళ, భోజ్పూరి వంటి భాషల్లో నటించిన నగ్మా గతంలో శరత్ కుమార్ తో ప్రేమాయణం నడిపింది. అయితే అప్పటికే శరత్ కుమార్ కి రాధిక కి పెళ్లయింది.
అయినప్పటికీ నగ్మా సీక్రెట్ గా శరత్ కుమార్ తో ఎఫైర్ పెట్టుకుందని తెలిసిన రాధిక ఎలాగైనా సరే నగ్మాకి అర్థమయ్యేటట్లు చెప్పి దూరం పెట్టా లేనుకుందట. అయితే రాధిక ని శరత్ పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తెలిసినా కూడా నగ్మా ప్రవర్తన మారకపోయే సరికి ఓ రోజు నగ్మా కి వార్నింగ్ ఇచ్చిందట.నువ్వు నా భర్తని వదిలేయకపోతే నీ పరిస్థితి దారుణంగా తయారవుతుంది అని చెప్పిందట. అయినప్పటికీ నగ్మా వినకపోయేసరికి ఓరోజు రాత్రి సమయంలో ఇంకొకసారి నా భర్తతో మాట్లాడినట్టుగానీ, తిరిగినట్టుగానీ,కలిసినట్టు గానీ తెలిస్తే మాత్రం నా చేతిలో చచ్చావ్ అంటూ చెంప చెల్లు మనిపించిందట.
అంతేకాదు నువ్వు నా భర్తని వదలకపోతే సినిమాల్లో నీకు ఒక్క అవకాశం కూడా రానివ్వను. నీ వ్యవహారం మొత్తం సినీ పెద్దలకు చెప్పి అవకాశాలు రాకుండా చేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చిందట.దాంతో రాధిక మాటలకు హాడలిపోయిన నగ్మా రాత్రికి రాత్రే ముంబై చెక్కేసినట్టు అప్పట్లో తమిళ మీడియాలో వార్తలు ప్రచారం అయ్యాయి. నగ్మాకి మాత్రమే కాదు శరత్ కుమార్ ని కూడా రాధిక మందలించి కొన్ని రోజులు మాట్లాడలేదట.దాంతో శరత్ కుమార్ కూడా నగ్మా ని పూర్తిగా మర్చిపోయి రాధిక కి సారీ చెప్పారట.