Moviesచిరంజీవి కోసం డిజాస్ట‌ర్ సినిమా స్క్రిఫ్ట్ పంపిన పూరి... ముక్క‌లుగా చించి...

చిరంజీవి కోసం డిజాస్ట‌ర్ సినిమా స్క్రిఫ్ట్ పంపిన పూరి… ముక్క‌లుగా చించి ఏం చేశాడంటే…!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక్క సినిమా అయినా డైరెక్ట్ చేయాలని టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. నిజం చెప్పాలంటే చిరంజీవి రీఎంట్రీ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే తెర‌కెక్కించాల్సి ఉంది. ఇందుకోసం పూరి జగన్నాథ్ ఆటో జానీ స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకుని చిరంజీవికి వినిపించారు. మూడు, నాలుగు సార్లు పూరిని తన చుట్టూ తిప్పించుకున్న చిరంజీవి.. సెకండాఫ్ నచ్చలేదని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత కూడా పూరి జగన్నాథ్‌కు చిరంజీవి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో పూరి త‌న అస‌హ‌నం కూడా వ్య‌క్తం చేశారు.

ఇక పూరి జగన్నాథ్ తెలుగు స్టార్ హీరోలలో చిరంజీవి, వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. మరియు ముఖ్యంగా చిరంజీవితో ఎలాగైనా ఒక్క సినిమా అయినా తీయాలని పూరి పంతం వేసుకొని 15ఏళ్ళుగా ప్రయత్నాలు చేస్తున్న చిరంజీవి మాత్రం పూరిని తన దగ్గరికే రానివ్వడం లేదు. ఇక పూరి జగన్నాథ్ కెరీర్ పరంగా వరుస హిట్ల‌తో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. అప్పుడే చిరంజీవికి ఆంధ్రావాలా సినిమా కథ‌ చెప్పారట. తన నిర్ణయం తర్వాత చెప్తానని చిరంజీవి దాటేశారు.

తర్వాత అదే కథని చిరంజీవి.. చిన్ని కృష్ణకు పంపారట. అప్పటికే చిన్నికృష్ణ.. చిరంజీవికి ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు కథ ఇచ్చి ఉన్నారు. చిరంజీవి పంపిన కథ మొత్తం చదివిన చిన్ని కృష్ణ ఆ కథను నాలుగు ముక్కలుగా చేసి మళ్ళీ అదే కవర్లో పెట్టి చిరంజీవికి పంపారట. దాని అర్థం చిరంజీవికి ఈ కథకు సూట్ కాద‌ని.. చిన్ని కృష్ణ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పేశారు. అలా చిరంజీవి ఆంధ్రావాలా కథను రిజెక్ట్ చేశారు. తర్వాత పూరి జగన్నాథ్ అదే కథను ఎన్టీఆర్‌కు చెప్పి ఆంధ్రావాలా సినిమా చేశారు. ఆంధ్రావాలా సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news