Moviesఆ హీరోయిన్‌తో ఎంగేజ్మెంట్ కోసం కాస్ట్లీ డైమండ్ రింగ్ కొన్న ప్రభాస్.....

ఆ హీరోయిన్‌తో ఎంగేజ్మెంట్ కోసం కాస్ట్లీ డైమండ్ రింగ్ కొన్న ప్రభాస్.. కానీ చివరికి..?

ప్రభాస్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోని బ్రహ్మచారి.. ప్రభాస్ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతున్నాయో ఆయన పెళ్లికి సంబంధించిన న్యూస్ కూడా అంతే వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ ఏదైనా సినిమా చేస్తున్నారంటే చాలు ఆ సినిమా ఈవెంట్లో కచ్చితంగా ఆయన పెళ్లికి సంబంధించిన ఒక్క ప్రశ్ననైనా ఎదురవుతుంది. ఈ ప్రశ్న ల నుండి తప్పించుకోవడానికి ప్రభాస్ ఎన్నో సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. మరి పెళ్లికి సంబంధించి గుడ్ న్యూస్ చెబుతారా అంటే అదీ లేదు. ఇదంతా పక్కన పెడితే ఎంతోమంది సినీ నటినటుల జీవితాలను దగ్గర నుండి చూసిన ఈమంది రామారావు ప్రభాస్ గురించి ఓ సంచలన విషయం బయట పెట్టారు.

ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ ప్రస్తుతం అనుష్కతో ప్రేమలో ఉన్నారు. ఇది ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటున్న మాటే.అయితే అనుష్క కంటే ముందే త్రిషతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే వీరి మధ్య క్లోజ్ నెస్ అంతలా ఉండేది. ఇక దాదాపు వీరిద్దరి మధ్య ఎంగేజ్మెంట్ జరిగిపోయినట్లే. ఎందుకంటే వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారు. అలాగే పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకున్నారు.

అందుకే వీరి కాంబోలో పౌర్ణమి, వర్షం,బుజ్జిగాడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఇక వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి దర్శకులు కూడా వీరితో సినిమాలు చేస్తే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యి సినిమాలు హిట్ అవుతాయని భావించారు. అలా ఇరు కుటుంబాలకు కూడా వీరి వ్యవహారం తెలుసు. దాంతో వాళ్లు కూడా సైలెంట్ గానే ఉన్నారు. ఇక ఒకానొక సమయంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అలాగే పెళ్లికి ముందు జరిగే ఎంగేజ్మెంట్ కోసం ప్రభాస్ త్రిష వేలికి పెట్టడానికి కాస్ట్లీ డైమండ్ రింగ్ ని కూడా కొనుగోలు చేశాడు. అప్పట్లో ఈ మ్యాటర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. కానీ అనూహ్యంగా వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది.

అయితే త్రిష ఓ కోలీవుడ్ హీరో తో సన్నిహితంగా ఉండడం ప్రభాస్ కి నచ్చలేదు.దాంతో ఓసారి త్రిషని మందలించినప్పటికీ ఆమె వ్యవహారం మారలేదు. అయితే త్రిష ఇండస్ట్రీలో ఉండడం కారణంగా ఫ్రీడం అనేది ఎక్కువగా ఉండాలి అని కోరుకునేది.దాంతో తనకి వచ్చే అమ్మాయి మరీ ఇంత ఫ్రీడమ్ గా ఉంటే బాగుండదు అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ ప్రభాస్ అప్పటినుండి త్రిషకి దూరంగా ఉన్నారు. ఇక త్రిషకి మాత్రమే కాదు పెళ్లికి కూడా దూరంగా ఉంటున్నారు అంటూ ఈమంది రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news