పాపం..ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే టైమ్ అస్సలు బాగోలేనట్టుంది. అందుకే ఏది పట్టుకున్న సరే బ్లాస్టింగ్ రేంజ్ లో ఆమెకే బౌన్స్ బ్యాక్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ వచ్చింది. రీజన్ ఏంటో తెలియదు కానీ సడన్గా ఈ ముద్దుగుమ్మ ఫేడ్ అవుట్ అయిపోయింది . స్టార్ హీరోస్ తో నటించినా కూడా హిట్ కొట్టలేదు.
ఆ తర్వాత డైరెక్టర్స్ పట్టించుకోవడమే మానేశారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆమె సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ వస్తుంది . కాగా రీసెంట్గా పూజా హెగ్డే నాగచైతన్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అంటూ వార్తలు వినిపించాయి . విరుపాక్ష డైరెక్టర్ తో నాగచైతన్య ఒక సినిమాలో నటించబోతున్నాడు అంటూ తెగ ప్రచారం జరిగింది. ఈ సినిమాలో మెయిన్ లీడ్ హీరోయిన్గా పూజ హెగ్డేను అనుకున్నారు అంటూ కూడా తెగ వార్తలు వినిపించాయి . సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ రోల్ మళ్లీ శ్రీ లీల చేతికి వచ్చేసిందట .
మేకర్స్ సడన్ గా ఈ ప్రాజెక్టులో శ్రీ లీలను భాగం చేశారట. దీంతో పూజ హెగ్డే ఖాతా నుంచి మరొక ఆఫర్ పోయినట్లయింది. గతంలో గుంటూరు కారం సినిమా విషయంలోనూ ఇలాగే జరగడం గమనార్హం . తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ పూజా హెగ్డే పాలిట శ్రీ లీల ఓ శని దేవతల మారిపోయింది. ప్రజెంట్ శ్రీ లీల తెలుగులో మూడు సినిమాలకు పైగానే కమిట్ అయింది . రవితేజ 75వ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీలనే నటిస్తుంది . అదేవిధంగా శ్రీ లీల నితిన్ సినిమా రాబిన్ హుడ్ లో కూడా హీరోయిన్గా నటిస్తుంది . ఇప్పుడు నాగచైతన్య సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తుంది . ఇదే విధంగా కొనసాగితే మరొకసారి ఇండస్ట్రీని ఆమె ఏలేయడం పక్కా అని చెప్పడంలో సందేహం లేదు..!!