ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్తలు తెలుసుకోవడానికి జనాలు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి భారీ మెజారిటీతో గెలుపొంది.. డిప్యూటీ సీఎంగా అధికారం చేపట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనదైన స్టైల్ లో ఏపీ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాడు . ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు.
ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలు కూడా ట్రెండ్ అవుతున్నాయి . కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ అందరూ రాద్ధాంతం చేసే విషయం అందరికీ తెలిసిందే . గతంలో ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణు దేశాయ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టింది . పవన్ కళ్యాణ్ ఎవరు చెప్పినా మాట వినినా వినకపోయినా ఆద్య చెప్పిన మాట మాత్రం కచ్చితంగా వింటాడట .
అంతేకాదు ఆధ్యా కాల్ చేసి ఎక్కడున్నావ్.. నిన్ను చూడాలని ఉంది రా ..అంటే వెంటనే వచ్చేస్తాడట. ఆధ్యా ఏది అడిగితే అది కచ్చితంగా పవన్ కళ్యాణ్ చేస్తాడట. ఏదైనా కావాలనిపిస్తే డాడీ నాకు ఇది కావాలి అంటే సెకండ్స్ లోనే ఆధ్యా కళ్ళ ముందు ఉంచుతాడట . అంత ప్రేమ ఆధ్యా అంటే పవన్ కళ్యాణ్ కి అంటూ గతంలో రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ విషయంలో పెత్తనం మొత్తం కూడా అమ్మ కన్నా భార్య కన్నా కూతురిదేనా..? అన్న రేంజ్ లో ఇప్పుడు ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు. కాగా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆధ్యా కూడా హాజరైంది. చాలా ట్రెడిషనల్ గా చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది . ప్రెసెంట్ ఆమెకి సంబంధించిన ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!