పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఉండరు. చిరంజీవి తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. అన్నను మించిన శక్తిగా మారాడు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశాడు. సినిమా హీరో నుంచి ఏపీ ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు. ప్రొఫెషన్ గురించి కాసేపు పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు, విడాకుల గురించి మనందరికీ తెలుసు.
మొదటిది పెద్దలు కుదిర్చిన వివాహం కాగా.. మిగతా రెండు పవన్ ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే తన ముగ్గురు భార్యల కంటే ఎక్కువగా మరొకరిని పవన్ ప్రేమించాడు. ఎంతలా అంటే క్షణం కూడా విడిచిపెట్టలేనంత. గతంలో పవన్ కళ్యాణ్ స్వయంగా తన ఫస్ట్ లవ్ స్టోరీ గురించి రివిల్ చేశాడు. ఇంతకీ పవన్ ఫస్ట్ లవ్ ఎవరో తెలుసా.. రివాల్వర్. అవును, మీరు విన్నది నిజమే.
పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్, ఫస్ట్ ఎఫైర్ మరియు ఫస్ట్ కిస్ రివాల్వర్ తోనే జరిగిందట. టీనేజ్ నుంచి గన్స్ అంటే పవన్ కళ్యాణ్ కు చాలా ఇష్టముండేదట. ఈ విషయాన్ని గమనించిన చిరంజీవి.. గన్స్‌పై ఉన్న పిచ్చితో పవన్ కళ్యాణ్ ఎక్కడ తీవ్రవాద ఉద్యమాల్లో తిరుగుతారేమోనని భయపడ్డారట. ఆ భయంతో చిరంజీవి సొంతంగా లైసెన్స్డ్ రివాల్వర్ కొని పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ గా ప్రజెంట్ చేశారట.
రివాల్వర్ వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ దాన్ని క్షణం కూడా వదిలి ఉండలేకపోయేవారట. దానిపై ఎంతో ప్రేమను పెంచుకున్నారు. ఎప్పుడూ జేబులోనే గన్ ను ఉంచుకునేవారట. నిద్రపోయే సమయంలో పక్కలోనే పెట్టుకుని పడుకునేవారట. అంతేకాదు ఉదయం లేవగానే ఫస్ట్ కిస్ రివాల్వర్ కే ఇచ్చేవారట. నా ఫస్ట్ లవ్ మా అన్నయ్య కొనిచ్చిన గన్నే అని గతంలో పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించడం విశేషం.