Movies"ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క".. మోక్షజ్ఞ సినీ...

“ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క”.. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫిక్స్ అయిపోయిందోచ్.. డైరెక్టర్ ఎవరంటే..?

ఫైనల్లీ ..కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా..? అంటూ ఎదురు చూస్తున్నా క్రేజీ అప్డేట్ రానే వచ్చేసింది. నందమూరి వంశం నుంచి మూడోతరం హీరో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు . ఇన్నాళ్లు మోక్షజ్ఞ ఎంట్రీ అప్పుడు ఉంటుంది ..? ఎవరితో ఉంటుంది..? అంటూ నానా విధాలుగా మాట్లాడుకున్నారు. అసలు మోక్షజ్ఞ ఎంట్రీనే ఉండదు అంటూ కొంతమంది మాట్లాడుకున్నారు. ఫైనల్లీ వాటికి బ్రేక్ పెట్టేసాడు మోక్షజ్ఞ . తాను డెబ్యూ ఇచ్చే డైరెక్టర్ను అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు .

దీనితో సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . మోక్షజ్ఞ తన ఎక్స్ లో “వస్తున్న ..మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ పోస్ట్ చేశారు”.. అనంతరం కొద్దిసేపటికి రెండు ట్వీట్ల్ లు చేశాడు . మరో ట్వీట్లో ఈ సంవత్సరమే బాలకృష్ణ ఎన్వికె 108 ..ఎన్టీఆర్ దేవర మోక్షజ్ఞ కి అరంగేట్రం ..నందమూరి నామ సంవత్సరం” అంటూ అభివర్ణించాడు . దీంతో సినిమా ఇండస్ట్రీలో ఈ ట్వీట్స్ హైలైట్ గా మారాయి.

తెలుగు సినీ పరిశ్రమలో అతిపెద్ద కుటుంబముగా ఉన్న నందమూరి వంశం గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే. నందమూరి వంశం నుంచి ఎంతోమంది వచ్చారు. సినీ పరిశ్రమ లో అందరూ కూడా సక్సెస్ అయ్యారు . మూడోతరం వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తూ ఉండడం గమనార్హం . మోక్షజ్ఞ వయసు 29 ఏళ్లు.. ఇంత లేటు వయసులోనూ హీరోగా ఎంట్రీ ఇస్తున్న తనకంటూ ఫుల్ ఫ్లెజుడ్ గా స్పెషాలిటీస్ ఉన్న విధంగానే ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు. గతంలో చాలా సార్లు రాజకీయ సినీ కార్యక్రమాలలో మోక్షజ్ఞ కనిపించాడు . మొదట్లో చాలా బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ ఆ తర్వాత చాలా చాలా స్లిమ్ గా మారాడు . లావు తగ్గడానికి ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. తర్వాత మోక్షజ్ఞ స్లిమ్ అయిన తర్వాత మోక్షజ్ఞను ఇండస్ట్రీలోకి హీరోగా రప్పిస్తున్నారు నందమూరి బాలయ్య.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news