Moviesదేవ‌ర‌లో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్‌.. ఆ రెండు పాత్ర‌లు ఇవే..?

దేవ‌ర‌లో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్‌.. ఆ రెండు పాత్ర‌లు ఇవే..?

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్‌… మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. త్రిబుల్ ఆర్ సినిమా త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ న‌టిస్తోన్న సినిమా.. అటు ఆచార్య ప్లాప్ త‌ర్వాత కొర‌టాల శివ క‌సితో తీస్తోన్న సినిమా కావ‌డంతో దేవ‌ర‌పై మామూలు అంచ‌నాలు లేవు. పైగా పాన్ ఇండియా రేంజ్‌లో రెండు పార్టులుగా దేవ‌ర సినిమా వ‌స్తోంది.

ఈ మోస్ట్ అవైటెడ్ భారీ పాన్ ఇండియా సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు అయితే సినిమా ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? అని క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇక ఈ సినిమాపై ఇప్ప‌టికే సాలిడ్ బ‌జ్ ఏర్ప‌డింది. ఈ సినిమాలో తార‌క్ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపిస్తాడ‌న్న స‌మాచారం ఇప్ప‌టికే ఉంది.

ఈ రెండు పాత్ర‌లలో ఒక‌టి సముద్ర ప్రాంతానికి చెందిన గిరిజ‌నుల నేప‌థ్యంలో ఉంటుంద‌ట‌. రెండోది ఉత్త‌ర భార‌త‌దేశంలో ఓ టౌన్‌లో ఉండే కుర్రాడి పాత్ర‌లో ఉంటుంద‌ట‌. ఇది నిజ‌మే అని క్లారిటీ వ‌చ్చేసింది. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఇచ్చిన ఇంట‌ర్వూలోనే దేవ‌ర క‌థ ఇలాగే ఉంటుంద‌ని చెప్పిన విష‌యంతో తార‌క్ డ్యూయ‌ల్ రోల్‌పై క్లారిటీ వ‌చ్చింది. ఇక కొర‌టాల శివ అదిరిపోయే స్క్రీన్ ప్లేతో దేవ‌ర సినిమాను తెరకెక్కిస్తున్నారని కూడా తెలిపాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news