జమున స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతోన్న రోజులు అవి. ఆ టైంలో ఆమె ఇద్దరు స్టార్ హీరోల ఆగ్రహానికి గురై అనధికారిక బ్యాన్‌కు గురైంది. భూ కైలాస్ సినిమా చెన్నైలో మెరీనా బీచ్‌లో జరుగుతోంది. అసలే ఎండాకాలం సూర్యుడు ఉదయించే టైంకు ఫస్ట్ షాట్ తీసేయాలి.. రావణాసురుడిగా ఎన్టీఆర్, నారధుడిగా ఏఎన్నార్, ఆయన భార్యగా జమున నటిస్తున్నారు. ఎన్టీఆర్, అక్కినేని ఐదు గంటలకే స్పాట్‌కు వచ్చారు. జమున 10 గంటలు దాటాక కాని రాలేదు.
అప్పటికే అక్కడున్న వారంతా ఎండలో మాడిపోతున్నారు. ఆ టైంలో జమున కారు దిగి నేరుగా వచ్చేసి దర్శక నిర్మాతల దగ్గరకు వెళ్లి షాట్ రెడీనా అన్నారు. ఆమె కోసం ఇద్దరు స్టార్ హీరోయిన్లు నాలుగు గంటలు వెయిట్ చేసినా కనీసం కర్టెసీగా సారీ కూడా చెప్పలేదు.. అసలు వాళ్ల వైపే చూడలేదు. జమున అలా చేయడం ఎన్టీఆర్‌కు అస్సలు నచ్చలేదు. ఆ రోజు షూటింగ్ ముగిశాక ఎన్టీఆర్.. ఏఎన్నార్‌ను తన కారులో ఎక్కించుకున్నారు.. బ్రదర్ మనలను ఇంత సేపు వెయిట్ చేయించి సారీ కూడా చెప్పలేదు.. జమునది క్షమించరాని నేరం.. ఇక నుంచి నేను ఆమెతో సినిమాలు చేయను.. మీరు కూడా వద్దని చెప్పడంతో ఏఎన్నార్ ఓకే అన్నారు.
అలా నాలుగేళ్ల పాటు జమునకు ఈ ఇద్దరు స్టార్ హీరోలు అవకాశం ఇవ్వలేదు. అయినా ఆమె మిడిల్ రేంజ్ హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ తన స్టార్ డం కాపాడుకుంది. చివరకు జమునపై ఉన్న ఈ బ్యాన్ చక్రపాణి వల్ల తొలగింది. గుండమ్మ కథ సినిమాలో తనకు జమునే కావాలని ఆయన అన్నారు. జమున లేకపోతే ఈ పాత్ర.. ఈ సినిమా లేదని చెప్పడంతో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ కాదనలేకపోయారు.
అలా నాలుగేళ్ల తర్వాత గుండమ్మ కథ సినిమాలో ఆమె ఇద్దరు హీరోల సరసన నటించింది. ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత గొడవని మర్చిపోయి మళ్లీ ఆమెతో సినిమాలు చేశారు. అది అలా జమునపై నాలుగేళ్లు ఎన్టీఆర్, ఏఎన్నార్ విధించిన అప్రకటిత బ్యాన్.