Moviesత‌గ్గేదే లే.. పుష్ప 2 వ‌చ్చేది ఆ రోజే..!

త‌గ్గేదే లే.. పుష్ప 2 వ‌చ్చేది ఆ రోజే..!

ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్స్ లో పుష్ప 2 ఒకటి. 2021లో విడుదలైన పుష్ప ది రైజ్ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేయడంతో దానికి కొనసాగింపుగా వస్తున్నా పుష్ప 2: ది రూల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

నేష‌నల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. ఫహాద్ ఫాసిల్, కేశవ, జగపతి బాబు, ప్ర‌కాష్ రాజ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని ఆగస్టు 15న‌ విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ పూర్తికాక పోవడం వల్ల డిసెంబర్ కు రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేశారు. అయితే గత కొద్దిరోజుల నుంచి పుష్ప 2 మరోసారి వాయిదా పడ‌బోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగ‌తి తెలిసిందే.

దీనికి తోడు ఇటీవల అల్లు అర్జున్, సుకుమార్ మధ్య గొడవలు తలెత్తయనే వార్తలు టాలీవుడ్ ను షేక్ చేశాయి. అయితే ఈ వార్తలను అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్, ప్రముఖ నిర్మాత బన్నీ వాసు కొట్టిపరేశారు. ఇదిలా ఏంటే.. ఇండియా వైడ్ గా 2024లో మూవీ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల జాబితాను తాజాగా ఐఎండీబీ విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో పుష్ప 2 అగ్రస్థానంలో నిలవడం విశేషం. టాప్ ప్లేస్ ను పుష్ప 2 ద‌క్కించుకోగా.. ఆ తర్వాత స్థానాల్లో దేవ‌ర‌, వెల్కమ్ టూ ద‌ జంగిల్, గోట్, కాంగువా, సింగ‌మ్ ఏగైన్, తంగ‌లాన్‌, భూల్ భూల‌య్యా-3, ఆరోన్ మే క‌హాన్ ద‌మ్ తా, స్త్రీ-2 వంటి చిత్రాలు ఉన్నాయి.

ఐఎండీబీ రిలీజ్ చేసిన ఈ జాబితా పై పుష్ప 2 మేకర్స్ స్పందించారు. ఒక తెలుగు సినిమా కోసం దేశమంతా ఎదురు చూడడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే పుష్ప 2 రిలీజ్ డేట్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ 6న వచ్చేస్తున్నాం.. తగ్గేదేలే అంటూ ఓ వీడియోను పంచుకున్నారు. ఈ అప్డేట్ తో పుష్ప 2 వాయిదా పడుతుందనే వార్తలకు చెక్‌ పడింది. డిసెంబర్ 6న థియేటర్స్ లోకి పుష్పరాజ్ రావడం ఖాయమైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news