తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటివరకు ఈ షో తెలుగులో ఏడు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 కూడా ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు యాజమాన్యం ఒక ప్రోమోను విడుదల చేసింది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ 1న బిగ్ బాస్ కొత్త సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదే తరుణంలో బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ పలువురి పేర్ల జాబితా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ జాబితాలో బుల్లితెర సెలబ్రిటీలు, జబర్దస్త్ నటీనటులు, ప్రముఖ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు చాలా మందే ఉన్నారు. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 1ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండో సీజన్ కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వివరించాడు.
మూడో సీజన్ నుంచి ఏడో సీజన్ వరకు నాగార్జునే హోస్ట్ గా ఉన్నారు. ఇప్పుడు ఎనిమిదో సీజన్ కు సైతం ఆయనే కొనసాగబోతున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 8కి నాగార్జున తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీజన్.. సీజన్ కు ఆయన తన పారితోషికాన్ని పెంచుకుంటూ పోతున్నారు. మూడో సీజన్ కు రూ. 5-8 కోట్లు, నాల్గవ సీజన్‌కు రూ. 8–10 కోట్లు, ఏదో సీజన్ కు రూ. 12 కోట్లు, ఆరవ సీజన్ కు రూ. 16 కోట్లు మరియు గత ఏడాది ప్రసారమైన ఏడో సీజన్ కు రూ. 20 కోట్లు నాగార్జున ఛార్జ్ చేసినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
అయితే ఈసారి నాగార్జున అంతకు మించి రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారట. ఇండస్ట్రీ వర్గాల సమచారం ప్రకారం.. బిగ్ బాస్ సీజన్ 8 కోసం నాగార్జున రూ. 30 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట. ఇందుకు సంబంధించిన డీల్ కూడా పూర్తైందట. కాగా, బిగ్ బాస్ షో 105 రోజులు ఉంటుంది. నాగార్జున కనిపించేది శని, ఆదివారాలు మాత్రమే. సరిగ్గా లెక్కేస్తే 105 రోజుల్లో ఆయన ముప్పై రోజులు కూడా కనిపంచరు. అయినా సరే రూ. 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.