టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోయిన్లకు ఛాన్సులు ఇవ్వడంలో ముందు వరుసలో ఉంటాడు. కొత్త అమ్మాయిలను హీరోయిన్లుగా తీసుకురావడంలోనూ లేదా బాలీవుడ్‌లో అప్పటికే పాపులర్ అయిన స్టార్ హీరోయిన్లకు తెలుగులో అవకాశాలు ఇవ్వటమో.. నాగార్జున చేస్తూ ఉంటారు. అందుకే నాగార్జునకు మన్మధుడుగా, అమ్మాయిల కలల రాకుమారుడు అన్న పేరు ఉంది. అయితే నాగార్జున కొన్ని సినిమాలలో వయసులో తనకంటే చాలా తక్కువ ఉన్న కుర్ర భామలతో నటించాడు.
నాగార్జున కుర్ర హీరోయిన్లకు అవకాశం ఇవ్వటం మంచిదే. అయినా నాగార్జున లాంటి ఏజ్ బార్ హీరోలతో సినిమాలు చేశాక ఆ హీరోయిన్లకు కుర్ర హీరోల నుంచి అవకాశాలు రాక.. వారి కెరీర్ దెబ్బతింది. సంతోషం సినిమాలో శ్రియా శరన్‌కు అవకాశం ఇచ్చి ఆమె స్టార్ హీరోయిన్ అవటానికి నాగార్జున బాగా హెల్ప్ చేశాడు. అలాగే అనుష్కకు తక్కువ టైంలోనే టాలీవుడ్ లో మంచి పాపులారిటీ రావడానికి.. స్టార్ కావడానికి నాగార్జున ఇచ్చిన అవకాశాలే కారణం. అయితే ఒక్క హీరోయిన్ విషయంలో నాగార్జున ఆమె కెరీర్ దెబ్బ కొట్టాడని.. అప్పట్లో టాలీవుడ్ లో చర్చ జరిగింది.
ఆ హీరోయిన్ ఎవరో ? కాదు.. పూనమ్ భాజ్వా. ఆమె తెలుగు అమ్మాయి. వైజాగ్ కు చెందిన ఆమె ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా చిన్న వయసు. మొదటి సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత నాగార్జున బాస్ సినిమాలో రెండో హీరోయిన్గా ఆమెకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో నయనతార మెయిన్ హీరోయిన్. బాస్ సినిమాలో ఆమెకు మంచి పాత్ర పడినా.. నాగార్జున సరసన నటించిన ఆమెకు కుర్ర హీరోలు అవకాశాలు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. లేదంటే అప్పట్లో ఫామ్ లో ఉన్న నితిన్, రామ్ చరణ్ లాంటి హీరోలు ఆమెకు అవకాశాలు ఇచ్చి ఉండేవారు.