Moviesనాగార్జున స్ట్రాంగ్ రికమెండేషన్.. బిగ్ బాస్ లోకి ఆ కాంట్రవర్షియల్ స్టార్..టీఆర్పీలు...

నాగార్జున స్ట్రాంగ్ రికమెండేషన్.. బిగ్ బాస్ లోకి ఆ కాంట్రవర్షియల్ స్టార్..టీఆర్పీలు బ్లాస్ట్ నో డౌట్..!!

కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా. అంటూ ఎదురు చూస్తున్న బిగ్బాస్ సీజన్ 8 టెలికాస్ట్ డేట్ సోషల్ మీడియాలో లీకై ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది టెలివిజన్ రంగంలోనే అతి పెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఇప్పటికే 7 సీజన్లను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లింది . త్వరలోనే ఎనిమిదవ సీజన్ ప్రారంభం కాబోతుంది . బిగ్ బాస్ రియాల్టీ షో ఎంత కాంట్రవర్షియల్ గా ఉంటుందో తెలిసిందే. ఈ షోలోకి వెళ్తే లైఫ్ సెటిల్ అవుతుంది అనుకున్నది ఒకప్పటి మాట.. లైఫ్ స్పాయిల్ అవుతుంది అన్నది నేటి మాట.

ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ షో కి వెళ్ళిన ఎవ్వరు కూడా లైఫ్లో సెటిల్ కాలేకపోవడం మైనస్ . అయితే దానికి తగ్గట్టు వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవడం కూడా మైనస్ అనే చెప్పాలి . అయితే చాలామంది మాత్రం బిగ్ బాస్ లోకి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . కాగా సోషల్ మీడియాలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టెలికాస్ట్ డేట్ లీకై వైరల్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 4 లేదా ఆగస్టు 11 వ తారీకున లాంచ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

అంతేకాదు ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జున నే యాంకరింగ్ చేయబోతున్నాడట . అంతేకాదు ఈసారి కొన్ని కొన్ని రూల్స్ కూడా మార్చేసారట. ఒక విడాకులు తీసుకున్న కపుల్ ని సైతం లోపలికి పంపించబోతున్నారట . విశ్వసనీయవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా బర్రెలక్క – హేమ – నటి సురేఖ వాణి – కిర్రాక్ ఆర్ పి – కుమారి ఆంటీ – రీతూ చౌదరి – రాజ్ తరుణ్ లాంటి స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు అమృత ప్రణయ్ పేరు కూడా ఇందులో వినిపిస్తూ ఉండడం గమనార్హం. చూద్దాం మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news